
ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ట్యాంకర్
● డ్రైవర్‌తో పాటు ఆరుగురికి గాయాలు ● వెనక సీటులో ఇరుక్కుపోయిన చిన్నారి, మహిళ
కారేపల్లి: ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టిన ఘటన సోమవారం కారేపల్లి మండలం కామేపల్లి క్రాస్ వద్ద సోమవారం జరిగింది. ఖమ్మం నుంచి ఇల్లెందు వైపు వెళ్తున్న బస్సు కామేపల్లి క్రాస్ స్టేజీ వద్ద ఆగింది. ఈక్రమంలో ప్రయాణికులు దిగుతుండగా వెనుక నుంచి వచ్చిన యాష్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ సమయాన బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు 47 మంది ప్రయాణికులు ఉండగా, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సు కాస్త ముందుకు వెళ్లి ఆగింది. ఈ ఘటనలో డ్రైవర్ అంజికి తీవ్రగాయం కాగా, వెనక సీటులో ఉన్న చిన్నారి ఇషిత, మరో మహిళ అందులో ఇరుక్కుపోయారు. దీంతో కారేపల్లి, కామేపల్లి పోలీసులతో పాటు స్థానికలు బస్సు వెనకాల నుంచి లోనకి వెళ్లి వారిని అతి కష్టంపై బయటకు తీసుకొచ్చారు. కాగా, ఘటనలో డ్రైవర్ సహా రమాదేవి, శ్రీవిద్య, సౌరి, బానోతు బాలా, ఇషిత, నాగభూషణం గాయపడడంతో 108 అంబులెన్స్‌లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఖమ్మం – ఇల్లెందు రహదారిపై వాహనాలు నిలిచిపోగా జేసీబీ తో బస్సు, లారీని పక్కకు తీయించారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతం ఎడమ వైపు కామేపల్లి, కుడి వైపు కారేపల్లి మండల పరిధిలోకి రావడంతో కేసు ఎవరు నమోదు చేయాలనే అనే అంశంపై పోలీసులు తర్జనభర్జన పడినట్లుతెలిసింది. చివరకు కారేపల్లి పరిధిగా తేల్చి ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు.డినట్లు తెలిసింది.

ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ట్యాంకర్