ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

Jul 5 2025 6:34 AM | Updated on Jul 5 2025 6:34 AM

ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మంలోని పలు రెస్టారెంట్లతో పాటు మసాలా దినుసులు, పచ్చళ్ల తయా రీ కేంద్రాలు, స్వీట్స్‌ షాపుల్లో రాష్ట్రఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ ఫోర్స్‌ బృందం శుక్రవారం తనిఖీలు చేపట్టింది. రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ ఫోర్స్‌ టీం హెడ్‌, జోనల్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యాన టాస్క్‌ఫోర్స్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు రోహిత్‌రెడ్డి, పి.స్వాతి, శ్రీషిక, సీహెచ్‌.లోకేష్‌, శరత్‌తో కూడిన బృందం ఖమ్మం వైరా రోడ్డులోని పీఎస్‌కే ఫుడ్స్‌ అండ్‌ స్పైసెస్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని జీ.పీ.రెడ్డి స్వీట్‌ షాప్‌, ఐస్‌ క్రీమ్‌ యూనిట్‌, పాలమూరు గ్రిల్స్‌ రెస్టారెంట్లలో తనిఖీ చేశారు.

కాలం చెల్లిన పదార్థాలు, హానీకర రంగులు

పాలమూరు గ్రిల్స్‌ రెస్టారెంట్‌లో వంటగది అపరిశుభ్రంగా ఉండడం, రిఫ్రిజిరేటర్‌, కోల్డ్‌ చాంబర్‌లో నిర్ణీత ఉష్ణోగ్రత లేవని అధికారులు గుర్తించారు. ఈసందర్భంగా ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే సామగ్రి, కూరగాయలు సరిగ్గా లేకపోవడంతో వాటిని ధ్వంసం చేసి నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. అలాగే, పీఎస్‌కే ఫుడ్స్‌ అండ్‌ స్పైసెస్‌లో సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోగా, ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో పచ్చళ్లు నిల్వ చేయడం, ముడి సరుకులపై ఈగలు ఉండడాన్ని గుర్తించి శాంపిళ్లు సేకరించడమే కాక నోటీసులు జారీ చేశారు. అలాగే, వైరా రోడ్డులోని ఐబాకో ఐస్‌క్రీమ్‌ యూని ట్‌లో సరైన పేరుతో లైసెన్స్‌ లేకపోగా, అపరి శుభ్ర వాతావరణం ఉండడంతో నోటీసు ఇచ్చారు. అంతకేకాక జీపీ రెడ్డి స్వీట్స్‌లో అపరిశుభ్ర వాతావరణంలో కేక్స్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు, కేక్‌లు, స్వీట్ల తయారీలో హానికర రసాయనా లు కలిగిన రంగులు కలుపుతున్నారని తేల్చారు. ఈమేరకు అనుమానిత సామగ్రిని సీజ్‌ చేసి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.

హోటళ్లు, స్వీట్‌ షాపుల్లో హానికర రంగులు, కాలం చెల్లిన పదార్థాల సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement