
నడవాలంటే నాట్యమే...
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రోడ్లపై నడుస్తుంటే నాట్యాన్ని తలపిస్తుంది. మున్సిపాలిటీ పరిధిలో 127 కి.మీ. రోడ్లు ఉండగా.. అందులో 35 కి.మీ.మేర మట్టి రోడ్డే ఉంటుంది. అలాగే, పలు చోట్ల సీసీ రోడ్లను పగలగొట్టి మిషన్ భగీరథ పైప్‌లైన్లు వేశారు. ఆతర్వాత మరమ్మతు చేసినా ఫలితం కానరావడం లేదు. ఇక ఇప్పుడు మధిరలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు చేపడుతుండడంతో అన్నిచోట్ల రోడ్లను తవ్వుతున్నారు. టీచర్స్ కాలనీ, ఎంప్లాయీస్ కాలనీ, బంజారాకాలనీ తదితర ప్రాంతాల్లో నల్లరేగడి మట్టి కావడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు బురదమయమవుతున్నాయి. గుంతల్లో నీరు నిలిచి ఎప్పుడు ఏ ప్రమా దం జరుగుతుందో తెలియక ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఆందోళన చెందుతున్నారు.
●