అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
తల్లాడ: వచ్చే మూడున్నర ఏళ్లలో రాష్ట్రంలోని ప్రతీ పేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తల్లాడ మండలం నారాయణపురం నుంచి కొడవటిమెట్ట వరకు రూ.5.50 కోట్లతో నిర్మించిన రహదారిని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తూ పాలన సాగిస్తోందని తెలిపారు. గత పాలకులు అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూనే ఎన్నికల వేళ తాము ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో మరి న్ని పథకాలను ప్రవేశపెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకోబ్, ఈఈ తానేశ్వర్, ఆర్డీఓ రాజేందర్, డీఈ ఖలీల్‌అహ్మద్, తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎంపీడీఓ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రైతును రాజును చేసింది మనమే...
కల్లూరు/తల్లాడ: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం సుభిక్షంగా ఉందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కల్లూరు, తల్లాడలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, సన్నబియ్యం పంపణీ చేస్తుండడమే కాక యువతకు ఉద్యోగాలు ఇచ్చామని, పేదలకు ఇళ్లు, రైతులకు భరోసా, బోనస్ ఇస్తున్నామని తెలిపారు. అంతేకాక భూభారతితో సమస్యలు పరిష్కరిస్తుండడం ద్వారా రైతులను రాజుగా చేస్తున్నామన్నారు. కాగా, కాంగ్రెస్ అమలుచేస్తున్న పథకాలు, గత ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఈనేపథ్యాన కార్యకర్తల్లో విబేధాలు ఉన్నా పక్కన పెట్టాలని తెలిపారు. ఈ సమావేశాల్లో ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మార్కెట్ చైర్మన్ భాగం నీరజాదేవితో పాటు నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, కాపా సుధాకర్, తూము వీరభద్రరావు, దగ్గుల రఘుపతిరెడ్డి, మారెళ్ల లక్ష్మణ్‌రావు, వీరారెడ్డి, కిషోర్, పోట్టేటి సంధ్యారాణి, బ్రహ్మారెడ్డి, గొడుగునూరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీరెడ్డి, జనార్దన్‌రెడ్డి, గుర్రం శ్రీనువాసరావు, తుమ్మపల్లి రమేష్, ఆనంద్‌బాబు, వెంకటనారాయణరెడ్డి, పొట్టేటి జనార్దన్‌రెడ్డి, వీరా రెడ్డి, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, భాగం ప్రభాకర్‌రావు, ఏనుగు సత్యంబాబు, పెద్దబోయిన శ్రీను, ఎల్.పుల్లారావు, భూక్యా శివకుమార్ నాయక్, యాసా వెంకటేశ్వరరావు, నోటి కృష్ణారెడ్డి, దామాల రాజు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం
రెండు కళ్లలా పాలన
తల్లాడలో అభివృద్ధి పనులు
ప్రారంభించిన మంత్రి పొంగులేటి
కల్లూరు, తల్లాడ కాంగ్రెస్
సమావేశాలకు హాజరు
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు


