
ఫిర్యాదులను పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఇచ్చే ప్రతీ దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లో ప్రజావాణి(గీవెన్స్ డే)లో భాగంగా సోమవారం ఆమె మరో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులు, దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన శ్రీజ మాట్లాడుతూ ప్రజలు అందించిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, డీఆర్‌డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు కొన్ని...
● ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు బి.సీతమ్మ, షేక్ రజియా సుల్తానా, ఎం.సావిత్రి తదితరులు తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని చెప్పి ఇప్పుడు రెండో విడతగా వస్తాయని అంటున్నారని ఫిర్యాదు చేశారు. ఇళ్లను తమకు మొదటి దశలోనే ఇప్పించాలని కోరారు. అలాగే, వేంసూరు మండలం కుంచుపర్తికి చెందిన కర్ణి దుర్గ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విన్నవించారు.
● బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన పి.రాంబాబు ఉపాధి హామీ పథకం పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.
● తల్లాడ మండలం బాలప్పేటకు చెందిన జి.వీరయ్య 2008 నుంచి గ్రామంలో ఉపాధి హామీ పథకం సీనియర్ మేట్‌గా పనిచేస్తు న్నాడు. దీంతో తనకు ఫీల్డ్ అసిస్టెంట్‌గా అవకాశం ఇవ్వాలని కోరారు.
‘గ్రీవెన్స్ డే’లో అదనపు కలెక్టర్ శ్రీజ