ఖమ్మంవన్‌టౌన్: మనిషి చివరి మజిలీ అయిన మహాప్రస్థానాలకు వచ్చే మృతుల బంధువులకు ఓదార్పునిచ్చేలా అన్ని సౌకర్యాలతో నిర్మించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణాలపై హైదరాబాద్‌లో బుధవారం ఆయన సమీక్షించారు. ఖమ్మం, సత్తుపల్లిలో మోడల్ వైకుంఠధామాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కేఎంసీ, సత్తుపల్లి కమిషనర్లు అభిషేక్ అగస్త్య, నరసింహను ఆదేశించారు. ఈసందర్భంగా కన్సల్టెన్సీ ప్రతినిధులు మోడల్ వైకుంఠధామాల నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా, సూర్యాపేట, నల్లగొండలో ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలను పరిశీలించాలని సూచించారు. ఆపై భూ కేటాయింపు, నిధుల విడుదలపై దృష్టి సారించాలని మంత్రి తెలిపారు.
ప్రణాళికలపై మంత్రి తుమ్మల సమీక్ష