ఖమ్మంరూరల్: ఏటా రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంసత్యనారాయణపురంలో పాలేరు నియోజకవర్గ ముస్లింలకు బుధవారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో కలెక్టర్ ముజుమ్మిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్ పాల్గొనగా మంత్రి మాట్లాడారు. రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష ఆచరించే ముస్లింల కు ఇచ్చే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. కాగా, నియోజకవర్గంలోని ఒక్కో మసీదు అభివృద్ధి, ఇతర పనులకు రూ.లక్ష చొప్పున మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ముస్లిం మైనార్టీలకు సైతం లబ్ధి జరుగుతుందని తెలిపారు. కాగా, గత ఏడాది మున్నేటికి వరదలు వచ్చిన సమయాన ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న పలువురిని తన ప్రాణాలు ఫణంగా పెట్టి రక్షించిన సుభానీని మంత్రి అభినందించారు. ఈకార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, చావా శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి