కొణిజర్ల: పదో తరగతి బాలబాలికలు ఆందోళన, భయం విడనాడి ప్రశాంత వాతావరణంలో వార్షిక పరీక్షలు రాయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. మండలంలోని తనికెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బుధవారం వచ్చిన ఆయన పదో తరగతి విద్యార్థులకు సూచనలు చేశారు. పౌష్టికాహా రం తీసుకుంటూ శ్రద్ధగా చదవాలని, తద్వారా పరీక్షల్లో మంచి మార్కులు సాధించొచ్చని తెలిపారు. అనంతరం అదే పాఠశాలలో ‘వుయ్ కెన్ లెర్న్’ పేరి ట నిర్వహిస్తున్న ఆంగ్లభాషా శిక్షణను కలెక్టర్ పరి శీలించారు. బాలబాలికలకు గ్రూపులుగా ఏర్పరిచి ఆంగ్లంలో మాట్లాడించారు. నాలుగు నెలల్లో మంచి మార్పు కనిపిస్తున్నందున విద్యార్థులంతా ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని సూచించారు. తొలుత తనికెళ్ల సెంటర్‌లో గ్రామపంచాయతీ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎంపీడీఓ ఏ.రోజారాణితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. తహసీల్దార్ రాము, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం డి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రిటైనింగ్ వాల్ పనుల్లో వేగం
ఖమ్మంఅర్బన్: మున్నేటి వరదకు అడ్డుకట్ట వేసేలా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్‌కు భూసేకరణతో పాటు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి పోలేపల్లి వద్ద రిటైనింగ్ వాల్ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు చేపట్టాలని, ఈ గోడ నిర్మాణానికి కావాల్సిన భూముల సేకరణకు నిర్వాసితులతో చర్చించాలని తెలిపారు. నిర్వాసితులకు అభివృద్ధి చేసిన భూములను ప్రత్యామ్నాయంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జలవనరులశాఖ ఎస్‌ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు, డీఈ రమేష్‌రెడ్డి, మన్మధరావు, తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఆర్‌ఐ క్రాంతి పాల్గొన్నారు.
ప్రతీ విద్యార్థి ఆంగ్లంపై పట్టు సాధించాలి
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్