రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం బావోజీ తండాలో పది ఎకరాల్లోని ఆయిల్‌పామ్‌తోటలో చెట్లు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా కాలిపోయాయి. బాధిత రైతు బానోత్ శివలాల్ తెలిపిన వివరాలు... బుధవారం మద్యాహ్నం తోటలో మంటలు చెలరేగాయనే సమాచారంతో వెళ్లగా కాపుదశకు వచ్చిన ఆయిల్‌పామ్ పామాయిల్ చెట్లు కాలిపోయాయని వాపోయారు. తోట మీదుగా వెళ్తున్న విద్యుత్ వైర్లను తొలగించాలని, అందుకు అయ్యే వ్యయం కూడా భరిస్తానని చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడం ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. వడగాలుతో విద్యుత్ తీగలు ఒకదానికొకటి తాకగా షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పారు. కాగా, శివలాల్ తోటలో మొదలైన మంటలు పక్క తోటకు సైతం వ్యాపించగా సుమారు పదెకరాల్లో తోట కాలిపోయింది. ఇప్పటికే గెలలు వేయగా త్వరలోనే అమ్మేందుకు సిద్ధమవుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.
షార్ట్ సర్క్యూటే కారణమని రైతులు ఆవేదన