
ప్రజారంజకంగా ఉంది..
ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకంగా ఉంది. ప్రజలందరి ఆశలకు అనుగుణంగా భావిభారత పౌరుల అభివృద్ధే ధ్యేయంగా కేటాయింపులు చేశారు. హామీల అమలుకు అధికంగా కేటాయించారు.
– పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు
ప్రాజెక్టులు పూర్తికావు...
రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలు ప్రతిబింబించేలా లేదు. రూ.56 వేల కోట్లతో హామీలు అమలుకాకపోగా, రూ.23వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావు. అయితే, వ్యవసాయ శాఖకు మాత్రం బడ్జెట్ పెంచడం ఒక్కటే శుభపరిణామం.
– బాగం హేమంతరావు,
జాతీయ సమితి సభ్యులు, సీపీఐ
హామీలకు అనుగుణంగా లేదు..
పాత బడ్జెట్ తరహాలోనే కొత్త మాటలతో ఉంది. ఆరు గ్యారంటీల్లో రెండు, మూడు తప్ప మిగతా వాటిని ప్రస్తావనే లేదు. ఉద్యోగాల భర్తీ అంశం లేకపోగా, విద్యా, వైద్యరంగాలకు సైతం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు.
– పోటు రంగారావు,
మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి
●

ప్రజారంజకంగా ఉంది..

ప్రజారంజకంగా ఉంది..