రూ.25వేల విలువైన మద్యం సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

రూ.25వేల విలువైన మద్యం సీజ్‌

Mar 19 2025 12:07 AM | Updated on Mar 19 2025 12:06 AM

వైరా: వైరా మండలం గన్నవరంలో బెల్ట్‌షాప్‌లో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని ఎకై ్సజ్‌ ఉద్యోగులు సీజ్‌ చేశారు. గ్రామానికి మల్లికార్జునరావు బెల్టు షాప్‌ నిర్వహిస్తున్నాడనే సమాచారంతో మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూ.25 వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకుని, నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ మమతారెడ్డి తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

కల్లూరు: కల్లూరులోని తిరువూరు క్రాస్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇంకొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు... తిరువూరు క్రాస్‌ మీదుగా వెళ్తున్న కంటైనర్‌ను పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం బృందాబం చెక్‌ గ్రామానికి చెందిన గోబర్ధన్‌రాయ్‌ అతి వేగంగా, అజాగ్రత్తగా నడుతున్నాడు. ఈక్రమాన కల్లూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా వెనక కూర్చున్న ఏపీలోని ఎన్‌టీఆర్‌ జిల్లా విసన్నపేటకు చెందిన దుబ్బాక రాజారావు(50) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే బైక్‌ నడుపుతున్న వెంకటేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. ఈమేరకు మృతుడి బంధువు ప్రసాద్‌ ఫిర్యాదుతోకేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆర్‌ఎంపీ హత్యకు మరో ఆర్‌ఎంపీ కుట్ర

కామేపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స చేయాల్సిన వైద్యులు అర్హతకు మించి వైద్యం చేస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే తన ఆదాయానికి అడ్డొస్తున్నాడని భావించిన ఓ ఆర్‌ఎంపీ ఇంకొకరి హత్యకు యత్నించగా తృటిలో బయటపడ్డాడు. ఈమేరకు వివరాలిలా ఉన్నాయి. సింగరేణి మండలం కొత్తకమలాపురానికి చెందిన రంగారావు ఆర్‌ఎంపీగా గ్రామంలోనే కాక కామేపల్లి మండలం నెమలిపురితండాలోనూ ప్రజలకు చికిత్స చేస్తుంటాడు. అప్పటికే తండాలో ఆర్‌ఎంపీగా కొనసాగుతున్న వేముల రాధాకృష్ణ తన సంపాదనకు రంగారావు అడ్డొస్తున్నాడని భావించి హత్యకు కుట్ర పన్నాడు. ఈమేరకు రంగారావు ఈనెల 15న రాత్రి బైక్‌పై వెళ్తుండగా చౌటకుంట అలుగు సమీపాన రాధాకృష్ణ కారులో అడ్డు పెట్టి మరో ఐదుగురితో కలిసి రాడ్లతో దాడి చేయగా రంగారావుకు గాయాలయ్యాయి. ఇంతలోనే మరో బైక్‌ వస్తుండడంతో నిందితులు పారిపోయాడు. ఈమేరకు రంగారావు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై సాయికుమార్‌ విచారణ చేపట్టారు. దంతో రాధాకృష్ణ, నెమలిపురితండాకు చెందిన ధరావత్‌ నాగలక్ష్మి, ఈశ్వర్‌, ఖమ్మంకు చెందిన కుక్కల కార్తీక్‌, సుమంత్‌, వేణును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement