ప్రతిభ కనబర్చిన వారికి రూ.3లక్షల బహుమతులు | - | Sakshi
Sakshi News home page

ప్రతిభ కనబర్చిన వారికి రూ.3లక్షల బహుమతులు

Mar 19 2025 12:07 AM | Updated on Mar 19 2025 12:06 AM

ఖమ్మంగాంధీచౌక్‌: ఎస్సెస్సీ వార్షిక పరీక్షల ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.3లక్షల విలువైన బహుమతులు అందించనున్నట్లు మిత్రా ఫౌండేషన్‌, మిత్ర గ్రూప్‌ చైర్మన్‌ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఈమేరకు వివరాలతో కూడిన బ్రోచర్లను కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి మంగళవారం విడుదల చేశాక, సంస్థ కార్యాలయంలో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడారు. మొదటి బహుమతిగా రూ.25 వేల నగదు, ల్యాప్‌ట్యాప్‌, రెండు, మూడో స్థానాల్లో నిలిచిన వారికి రూ.15 వేల చొప్పున నగదు, ఐదుగురు ప్రతిభావంతులకు రూ.10 వేల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన వారిని విమానంలో ఢిల్లీ తీసుకెళ్లనుండగా తుమ్మల యుగంధర్‌ ప్రోత్సాహంతో కార్పొరేట్‌ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రంగా శ్రీనివాస్‌, చెరుకూరి యుగంధర్‌, పాలవరపు శ్రీనివాస్‌, చారుగుండ్ల రవికుమార్‌, నాగసాయి నగేష్‌, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ లేకుండానే సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగం

మంగాపురం వాసి నవ్యకు

రాష్ట్రస్థాయి పదో ర్యాంకు

తల్లాడ: మండలంలోని మంగాపురం గ్రామానికి చెందిన గాదె నవ్య సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగానికి నిర్వహించిన పరీక్షలో 215 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి పదో ర్యాంకుతో ఉద్యోగానికి ఎంపికై ంది. ఈ ఫలితాలు సోమవారం రాత్రి వెలువడ్డాయి. నవ్య భర్త పరుచూరి రమేష్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ పక్క ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఎలాంటి శిక్షణ లేకుండా మూడేళ్లు పట్టుదలతో సిద్ధమైన ఆమె ఉద్యోగానికి ఎంపికవడం విశేషం. కాగా, నవ్య 1–10 వ తరగతి వరకు తల్లాడ సాయి చైతన్య పాఠశాలలో, ఇంటర్‌ కేఎస్‌ఎం కళాశాలలో, డిగ్రీ ఖమ్మం నవీన కళాశాల, బీఈడీ మధిర పూర్తి చేసింది.

ఖమ్మం వాసికి అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి

ఖమ్మంక్రైం: ఖమ్మం పంపింగ్‌ వెల్‌రోడ్‌ ప్రాంత వాసి, సామాన్య కుటుంబంలో జన్మించి పోలీస్‌ శాఖలో ఎస్‌ఐగా ప్రస్తానం ప్రారంభించిన గోపతి నరేందర్‌కు అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి లభించింది. త్రీటౌన్‌ ప్రాంతానికి చెందిన సైదులు – కళావతి కుమారుడైన నరేందర్‌ను ఆయన తండ్రి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ కష్టపడి చదివించారు. 1996 బ్యాచ్‌లో ఎస్సైగా ఎంపికైన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఎస్సై, సీఐగా, జైపూర్‌, కరీంనగర్‌ ఏసీపీగా విధులు నిర్వర్తించారు. ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి గ్యాలరీ అవార్డు అందుకున్న నరేందర్‌ ప్రస్తుతం కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీగా పనిచేస్తుండగా అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయనను పలువురు అభినందించారు.

చిన్నకోరుకొండి

రేషన్‌ డీలర్‌ సస్పెన్షన్‌

180 బస్తాల బియ్యం మాయమైన

ఘటనలో చర్యలు

కల్లూరురూరల్‌: మండలంలోని చిన్నకోరుకొండికి చెందిన రేషన్‌ డీలర్‌ గూడిద భిక్షాలును సస్పెండ్‌ చేసినట్లు తహసీల్దార్‌ పులి సాంబశివుడు తెలిపారు. షాపులో నిల్వ చేసిన 180 బస్తాల బియ్యం చోరీ గురికాగా డీలర్‌ సోమవారం తహసీల్దార్‌, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు తహసీల్దార్‌, ఎస్సై హరిత మంగళవారం విచారణ చేపట్టగా, షాపులో దిగుమతి అయిన 117 క్వింటాళ్ల బియ్యంలో 180 బస్తాల బియ్యం చోరీ జరగడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు బియ్యాన్ని వాహనంలో తీసుకెళ్లినట్లు గుర్తించిన వారు, సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించాలని నిర్ణయించారు. అయితే, ఘటనలో డీలర్‌ నిర్లక్ష్యం, అజాగ్రత్త ఉందని భావిస్తూ భిక్షాలును సస్పెండ్‌ చేయడమే కాక విచారణ కొనసాగిస్తామని తెలిపారు.

ప్రతిభ కనబర్చిన వారికి రూ.3లక్షల బహుమతులు
1
1/2

ప్రతిభ కనబర్చిన వారికి రూ.3లక్షల బహుమతులు

ప్రతిభ కనబర్చిన వారికి రూ.3లక్షల బహుమతులు
2
2/2

ప్రతిభ కనబర్చిన వారికి రూ.3లక్షల బహుమతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement