మూడు రోజుల పాటు హోలీ వేడుకలు జరుపుకునే మండలంలోని లోక్యాతండా వాసులు రెండో రోజైన శనివారం డూండ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈమేరకు గత హోలీ నుంచి ఇప్పటి వరకు జన్మించిన మగ బిడ్డకు అన్నప్రాసన, నామకరణం జరిపించారు. అలాగే, గేర్యా(వేడుకల పెద్దలు) తండావాసులతో కలిసి కోలాటమాడుతూ డూండ్ జరుపుకునే వారి గృహాలకు వెళ్లారు. అక్కడ తల్లీబిడ్డలను ఆశీర్వదించగా డూండ్ నిర్వహించిన వారు విందు ఏర్పాటుచేశారు. కాగా, శనివారం తెల్లవారుజామున తండాలో నిర్వహించిన కామ దహనానికి తండా వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా కామదహనం ప్రదేశానికి వెళ్లి పూజలు చేశారు. – కూసుమంచి
లోక్యాతండాలో డూండ్ వేడుకలు