ఆహ్లాదం.. ఆకర్షణీయంవెలుగుమట్ల అర్బన్‌పార్కు
●వీకెండ్స్‌లో మరింత రద్దీ ●రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు ●పిక్నిక్‌లకు వేదికగా మారిన పార్కు
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న వెలుగుమట్ల అర్బన్ పార్కు పర్యాటకులను ఆకర్షిస్తోంది. వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కు పర్యాటపరంగా నగరవాసులకు వరంగానే చెప్పొచ్చు. ఏళ్లుగా ఈపార్కును గత పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఈక్రమంలో నూతన ప్రభు త్వం ఏర్పడ్డాక రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో పార్కు అభివృద్ధికి నోచుకుంది.
పాలకుల ప్రత్యేక దృష్టి..
వీకెండ్స్‌లో నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అధికారులు కోట్లాది రూపాయలు వెచ్చించి పనులకు శ్రీకారం చుట్టారు. కాగా, గతంలో కంటే సందర్శకులు పెరిగినట్లు పార్కు అధికారులు చెబుతుండడంతో చిన్న చిన్న పార్టీలు, గ్రూప్ మీటింగ్‌లు, ఆత్మీయ సమ్మేళనాలు తదితర వాటికి వేదిక కావాలని గత కొన్ని మాసాలుగా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, జిల్లా అటవీశాఖ అధికారి సిద్దార్థలు ప్రత్యేక దృష్టి సారించారు.
సందర్శకుల సందడి..
రానురాను పార్కుకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. దీంతో గతంలో రోజు 20 నుంచి 30 మంది వరకు పార్కు సందర్శన వస్తుండగా.. ప్రస్తుతం రోజుకు 100 నుంచి 200 వరకు వస్తున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో సుమారు 300 నుంచి 500 వరకు వస్తుండడంతో మరింత రద్దీ పెరిగింది. ఇటీవల కాలంలో ఆహ్లాదంతో పాటు విజ్ఞానపరంగా ఉపయోగపడుతుందని భావించిన జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పిక్నిక్ పరంగా పెద్ద ఎత్తున వచ్చిపోతున్నారు. పార్కులోని వివిధ రకాల మొక్కలు, పచ్చదనం, సేదదీరడానికి హట్, పార్కు వీక్షించేందుకు వాచ్ టవర్, చిల్డ్రన్ పార్కు, యోగా షెడ్డు తదిత
రాలతో పాటు పార్కునంతా వీక్షించడానికి ఓపెన్ జీపు సైతం అందుబాటులో ఉంచారు. ఇవేకాక సైకిల్ ట్రాకింగ్, పచ్చికబయళ్లు, తాగు నీటి ప్లాంట్ సౌకర్యాలు కల్పిస్తుండడంతో నగరవాసులను ఆకర్షిస్తోంది.
చకచకా అభివృద్ధి పనులు..
పార్కు అభివృద్ధిపై పాలకులు దృష్టి సారించి రూ. 2 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో ఇప్పటికే ఖమ్మం–వైరా ప్రధాన రోడ్డు నుంచి పార్కు వరకు డబుల్ లేన్ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు జరుగుతున్నారు. ఇవే త్వరగా పూర్తయితే ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు ఒక వేదికగా తయారవుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా, రోడ్డు విస్తరణలో కొంతమంది ప్లాట్లదారులు తమ విలువైన స్థలాలు కోల్పోతుండడంతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పనుల్లో అక్కడక్కడ జాప్యం జరుగుతుండగా.. వాటిని సెటిల్ చేసే పనుల్లో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు.
ప్లాస్టిక్ నిషేధం..
పార్కు లోపల ప్లాస్టిక్ నిషేధం అమలుకు శ్రీకారం చుట్టారు. బయట ఫుడ్ అనుమతి లేకుండా పార్కు లోపలే ప్లాస్టికేతర తినుబండరాలు విక్రయించేలా చేస్తున్నారు. ఇదే అమలైతే పచ్చదనం అందించడంతో పాటు ప్లాస్టిక్ జాడలేకుండా ప్రజాప్రతినిధులు, అధికారుల చర్యలు చేపట్టారు.
పని వేళలు..
పర్యాటకులు అర్బన్ పార్కును సందర్శించేందుకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటుంది. టిక్కెట్ ధర పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10, పార్కింగ్‌కు ద్విచక్రవాహనానికి రూ.10, కారుకు రూ.20, బస్సుకు రూ.100 వసూలు చేస్తున్నారు. కార్లు, ద్విచక్రవాహనాలు పార్కింగ్‌లో ఎండ ప్రభావం లేకుండా సోలార్ షెడ్డు సైతం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక వైపు వాహనాల నీడ పార్కింగ్, మరో వైపు సోలార్ విద్యుత్ తయారీకి ఎంతో ఉపయోగకరంగా మారింది.
ఆహ్లాదంగా ఉంది..
పచ్చదనంతో అటవీపార్కు చాలా బాగుంది. ప్రధాన రోడ్డు నుంచి పార్కులోకి రోడ్డు సరిగా లేకపోవడం కాస్తా ఇబ్బందిగా ఉంది. మా పిల్లలు పాఠశాల తరఫున సందర్శించి బాగుందని చెబితే నేను చూడాలని వచ్చా. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే నగరవాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
– డి.సతీష్, పర్యాటకుడు, ఖమ్మం
పర్యాటక వెలుగులు..!
పర్యాటక వెలుగులు..!
పర్యాటక వెలుగులు..!
పర్యాటక వెలుగులు..!