
జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌పై బీఆర్‌ఎస్ నిరసన
మధిర: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడంపై బీఆర్‌ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈమేరకు మధిర వైఎస్సార్ చౌరస్తాలో శుక్రవారం జరిగిన నిరసనలో జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జాప్యాన్ని ప్రశ్నించడమే కాక అక్రమాలపై నిలదీస్తుండడంతోనే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. నాయకులు బొగ్గుల భాస్కర్‌రెడ్డి, అరిగె శ్రీనివాసరావు, వై.వీ.అప్పారావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, షేక్ ఖాదర్, వేమిరెడ్డి పెదనాగిరెడ్డి, ఆళ్ల నాగబాబు, పరిశ శ్రీనివాసరావు, కొత్తపల్లి నర్సింహారావు, షేక్ సైదా, అబ్దుల్ ఖురేషి, పట్టాభి రామశర్మ, బత్తుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
ఎర్రుపాలెం: అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ పి.వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ములుగుమాడు గ్రామానికి చెందిన తోట వెంకటేశ్వరావు (37) తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. తర్వాత చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు మృతుడి భార్య శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
తప్పిపోయిన వ్యక్తి అప్పగింత
మధిర: భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని మధిర టౌన్ పోలీసులు అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు తన భార్యతో గొడవపడి శుక్రవారం ఇంటి నుంచి వెళ్లాడు. శ్రీనివాసరావు కుమారుడు సాయికుమార్ తన తండ్రి మధిరలో ఉన్నాడని తెలుసుకుని 100కు సమాచారం అందించాడు. మధిర టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొట్టే రిత్విక సాయి ఐపీఎస్ అతని లొకేషన్ ద్వారా ఇంటి నుంచి వెళ్లిపోయిన శ్రీనివాసరావు ఆచూకీని తెలుసుకున్నారు. మధిర రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించి ఎస్సై చంద్రశేఖరరావు అతనిని టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. బ్లూ కోర్టు కానిస్టేబుల్ కొండ, మల్లికార్జున్ ద్వారా సాయికుమార్‌కు అతని తండ్రిని అప్పగించారు. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులు టౌన్ ఎస్‌హెచ్‌ఓ సాయికి కృతజ్ఞతలు తెలిపారు.

జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌పై బీఆర్‌ఎస్ నిరసన