
రెండో రోజూ కొనసాగిన తనిఖీలు
నేలకొండపల్లి: మండలంలోని మోటాపురంలో ఓ వ్యాపారి భారీగా ధాన్యం నిల్వ చేశారనే ఫిర్యాదుతో సివిల్ సప్లయీస్ అధికారులు చేపట్టిన తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగాయి. సివిల్ సప్లయీస్ డీటీ మహ్మద్ అబ్ధుల్ నిసార్, ఆర్‌ఐ నరేష్ సంబంధిత వ్యాపారి వద్ధ ఉన్న ధాన్యం స్టాక్‌ను పరిశీలించి లెక్కలు వేయడంతో పాటు శాంపిల్స్ సేకరించారు. ఇదిలా ఉండగా పలువురు రైతులు ఆ ధాన్యం బస్తాలు తమవేనని అధికారులకు వివరణ ఇచ్చారు. అయితే, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకు ధాన్యం కదిలించొద్దని వ్యాపారిని ఆదేశించారు.