
మాట్లాడుతున్న స్కోప్ ఆర్‌డీ డైరెక్టర్ ప్రసాద్
ఖమ్మంవన్‌టౌన్: బాలబాలికలంతా ఆన్‌లైన్ లైంగిక దోపిడీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్కోప్ ఆర్‌డీ డైరెక్టర్ ఎంఎల్.ప్రసాద్ సూచించారు. ఖమ్మంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో సంస్థ ఆధ్వర్యాన చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారి సహకారంతో ‘ఆన్‌లైన్ చిల్డ్రన్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్’ అంశంపై బాలబాలికలకు ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ మాట్లాడుతూ బాలబాలికలు తెలిసీతెలియని వయస్సులో సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్ విరివిగా వినియోగించడం వల్ల రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తద్వారా శారీరక, మానసిక రుగ్మతలు ఏర్పడడమే కాక.. ఏమరపాటుగా ఉంటే వేధింపులకు గురికాక తప్పదన్నారు. ఈమేరకు పిల్లలను తల్లిదండ్రలు గమనించాలని సూ చించారు. సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్‌బాధ్యుడు నర్సింహారావు, అఖిల్ మాట్లాడగా కోఆర్డినేటర్ సుజాత పాల్గొన్నారు.