
ప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల
ఖమ్మంవన్‌టౌన్: ఖమ్మం వైద్య కళాశాల నిర్మాణ కాంట్రాక్టర్, బిల్డింగ్ డిజైన్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సమావేశమయ్యారు. ప్రతినిధులు చూపించిన డిజైన్ బాగుందని అన్నారు. తరగతి గదులు, హాస్టల్ భవనాలు, ప్రొఫెసర్లు, సిబ్బంది క్వార్టర్లు ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందనే విషయమై కళాశాల సూపరింటెండెంట్, అధ్యాపకుతో చర్చించాలని సూచించారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పారు. జిల్లా మైనింగ్ అధికారులతో మాట్లాడి వైద్య కళాశాలకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో గతంలో మట్టి కోసం గుంతలు చేసిన వారితో తిరిగి పూడ్పించి, చదును చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.