డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా
సాగర్ కాల్వలో పడడంతో
ఊపిరి ఆడక ఒకరు మృతి
సత్తుపల్లి(పెనుబల్లి): జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఒడిస్సా రాష్ట్రం కొరట్ ప్రాంతానికి చెందిన ప్రిన్స్, రేణుక, అనిల్‌కుమార్(26) ముగ్గురు కారులో చైన్నెకు వెళ్తున్నారు. వీరి వాహనం పెనుబల్లి మండల కేంద్రంలో విజ యవాడ – జగదల్‌పూర్ నేషనల్ హైవేపై ఆది వా రం అర్ధరాత్రి వెళ్తుండగా డివైడర్లు మొదలైన ప్రాంతం వద్ద సెంట్రర్ లైటింగ్, సూచిక బోర్డులు లేకపోవడంతో వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ పక్కనే సాగర్ కాల్వలో పడింది. ముందు సీట్‌లో కూర్చున్న అనిల్‌కుమార్ సీట్‌బెల్ట్ తీయడం సాధ్యం కాక ఛాతివరకు నీటిలో మునగడంతో ఊపిరాడక మృతిచెందాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు కారులో ఉన్న మరో ఇద్దరిని బయటకు తీసి పెనుబల్లి ఆస్పత్రి తరలించారు. జాతీయ రహదారిపై మొదలవుతున్న చోట కనీసం సూచిక బోర్డులు, సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసినట్లు వీ.ఎం.బంజరు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
పింఛన్ కోసం వెళ్తూ ..
తిరుమలాయపాలెం: పింఛన్ నగదు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్తున్న వృద్ధుడు మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. మండలంలోని పిండిప్రోలుకు చెందిన గోకినపల్లి శేషయ్య(65) సోమవారం మధ్యాహ్నం పిండిప్రోలులోని పింఛన్ నగదు కోసం ఐఓబీకి నడిచి వెళ్తున్నాడు. మరిపెడ నుంచి ఖమ్మంకు వేగంగా వెళ్తున్న కారు ఆయనను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన శేషయ్యను తిరుమలాయపాలెం సీహెచ్‌సీకి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
చికిత్స పొందుతున్న మహిళ..
చింతకాని: అనారోగ్య కారణాలతో పురుగుల మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలంలోని నాగిలిగొండకు చెందిన పి.సీతమ్మ(55) భర్త పదేళ్ల క్రితం చనిపోగా, కుమారుడు నరేష్ వద్ద ఉంటుంది. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మనస్థాపంతో ఈనెల 19న పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబీకులు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఆపై 26వ తేదీన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా చికిత్సపొందుతూ సోమవారం చనిపోయింది. ఆమె కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు.


