జాతీయ టీ.టీ.టోర్నీకి ముగ్గురి ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో ఈనెల 29 నుంచి జరగనున్న జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నీకి జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. పురుషుల విభా గంలో రెడ్డిసాయి శివ, అండర్–17లో పరిటా ల జ్వలిత్, పిట్టల మోహిత్ తెలంగాణ జట్టు తరఫునపోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నా రు. ఈమేరకు క్రీడాకారులను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్‌కుమార్, వి.సాంబమూర్తి అభినందించారు.
రాష్ట్రస్థాయి టోర్నీలో
రెండు పతకాలు
బోనకల్: రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నీలో జానకీపురం గ్రామానికి చెందిన గద్దల సిరి బంగారు పతకం సాధించింది. ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె మేడ్చల్‌లోని డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇటీవల జరిగిన అండర్–17 బాలికల విభాగం టోర్నీలో పాల్గొనగా.. డబుల్స్‌లో గోల్డ్‌మెడల్, సింగిల్స్‌లో రజత పతకం సాధించింది. ఆమెను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, కోచ్ సాంబమూర్తి, టేబుల్‌టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలసాని విజయ్‌కుమార్ అభినందించారు.
విచారణ అధికారిగా డిప్యూటీ సీఈఓ
ఖమ్మం సహకారనగర్: కూసుమంచిమండలం నర్సింహులగూడెం ఎంపీయూపీఎస్ పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఉపాధ్యాయుడిని ఇటీవల డీఈఓ సస్పెండ్ చేశారు. అంతేకాక విద్యార్థినుల తల్లి దండ్రుల ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదైంది. అయితే, పూర్తిస్థాయిలో విచారణ కోసం జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మజను నియమి స్తూ డీఈఓ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వచ్చేనెల 7వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సూచించారు.
పశువులకు
టీకాలు తప్పనిసరి
ముదిగొండ: గాలికుంటు వ్యాధి సోకకుండా పశువులకు తప్పనిసరి టీకాలు వేయించాలని పశు సంవర్ధక శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీరమణి సూచించారు. మండలంలోని చిరుమర్రి, వల్లాపురం, ఖానాపురం గ్రామాల్లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వనంవారి కిష్టాపురం వైద్యాధికారి మన్యం రమేష్ ఆధ్వర్యాన సోమవారం వేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన శ్రీరమణి మాట్లాడుతూ వ్యాధి సోకకుండా ముందస్తుగా రైతులు తమ పశువులకు టీకాలు వేయించాలని సూచించారు.
బ్యాటరీ దొంగల
ముఠా అరెస్ట్
ఖమ్మంఅర్బన్: వాహనాల్లో బ్యాటరీలు చోరీ చేస్తున్న ముగ్గురితో కూడిన ముఠాను ఖమ్మం అర్బన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఖమ్మంలోని చెరుకూరి గార్డెన్స్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఖమ్మం వైపు నుంచి వస్తున్న ఆటోలో ముగ్గురు అనుమానాస్పదంగా కకనిపించారు. దీంతో వారిని విచారించగా పలు వాహనాల్లో బ్యాటరీలు చోరీ చేసినట్టు ఒప్పుకున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో పాటు జల్సాలకు ఖర్చుల కోసం చోరీల బాట పట్టినట్లు తేలగా ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటకు చెందిన గుడెల్లి సాయి, పెండ్ర సాయికుమార్, అభిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఖమ్మం అర్బన్‌తో పాటు వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో చోరీ చేయగా, రూ.1.80లక్షల విలువైన ఆటో, 12 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నామని సీఐ భానుప్రకాశ్ వెల్లడించారు.
గోదావరి ఎక్స్‌ప్రెస్ రద్దు
ఖమ్మం రాపర్తినగర్: తుపాన్ సూచనలతో ఖమ్మం మీదుగా వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును రెండు పక్కలా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అయితే, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ వెళ్లే ఇతర రైళ్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. కాగా, గోదావరి రైలును ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారు, మిగతా రైళ్లు ఎప్పటి వరకు కొనసాగుతాయో స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు.
76 క్వింటాళ్ల
రేషన్ బియ్యం స్వాధీనం
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి మీదుగా వాహనంలో తరలిస్తున్న 76క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నా డు. గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి ఖమ్మం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు వ్యాన్‌ను సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకితీసుకున్నామని ఎస్సై వీరేందర్ తెలిపారు.


