‘చాంబర్’ నామినేషన్ల పర్వం ప్రారంభం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ సోమవా రం మొదలైంది. ఆఫీస్ బేరర్లు, ప్రధాన పదవులతో పాటు 18శాఖలకు నవంబర్ 16న ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకు మూడురోజుల పాటు నామినేష న్లు స్వీకరించనుండగా కార్తీక సోమవారం కావడంతో వివిధపదవులకు 37మంది నామినేషన్లు దాఖలు చేశా రు. సహాయ కార్యదర్శి పదవికి ముత్యం ఉప్పల్‌రా వు, కోశాధికారి పదవికి కై లాసపు వేణుగోపాల్‌రావుతో పాటు కేంద్ర కార్యవర్గ పదవికి పోట్ల రామనాథం నామినేషన్లు సమర్పించారు. అంతేకాక దిగుమతిశాఖ పదవులకు అధికంగా 24 నామినేషన్లు దాఖలయ్యా యి. ఇక అధ్యక్ష పదవికి వడ్డే వెంకటేశ్వర్లు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోలేటినవీన్, కార్యదర్శి పదవికి సోమారపు సుధీర్‌కుమార్, ఆత్మకూరి రామారావు, ఎర్ర అప్పారావు, మిర్చిశాఖ అధ్యక్ష పదవికి మెంతుల శ్రీశైలం, కార్యదర్శి పదవికి ఎడ్లపల్లి సతీష్‌తో పాటు కార్యవర్గ పదవులకు ఇద్దరు, ఎగుమతిశాఖ అధ్యక్ష పదవికి మన్నెం కృష్ణ నామినేషన్లు దాఖలు చేశారు. మంగళ, బుధవారం నామినేషన్ల స్వీకరించాక పరి శీలన, ఉపసంహరణ అనంతరం బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితా వెల్లడిస్తామని ఎన్నికల అధికారి పీ.బీ. శ్రీ రాములు తెలిపారు.


