ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం లంకపల్లికి చెందిన నడ్డి శాంతకుమార్(26) ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడగా.. ఇరవై రోజుల అనంతరం స్థానికులు గుర్తించారు. మండలంలోని బయన్నగూడెం వద్ద నేషనల్ హైవే పక్కన మామిడి తోటలో సోమవారం ట్రాక్టర్‌తో దున్నుతుండగా పూర్తిగా కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతుండడాన్ని ట్రాక్టర్ డ్రైవర్ గుర్తించాడు. ఈమేరకు అందిన సమాచారంతో వీ.ఎం.బంజరు ఎస్సై వెంకటేష్ చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి దుస్తుల ఆనవాళ్లతో శాంతకుమార్‌గా గుర్తించారు. ఆయన ఇరవై రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా వెళ్లాడని, ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదని కుటుంబీకులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబ కలహాలతో..
కూసుమంచి: మండలంలోని నర్సింహులగూడెంకు చెందిన కొక్కిరేణి ఎర్రయ్య (30) సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఆయన భార్యతో గొడవ జరగగా మనస్తాపంతో బలవన్మరనానికి పాల్పడ్డాడని ఎర్రయ్య తల్లి ఫిర్యాదుతోకేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
లేఖ రాసి విద్యార్థిని అదృశ్యం
ముదిగొండ: నేలకొండపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని కానరాకుండా పోయిన ఘట నపై ముదిగొండలో సోమవారం కేసు నమోదైంది. నేలకొండపల్లిలోని ఓప్రైవేట్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కొద్దిరోజులుగా కాలేజీకి వెళ్లకపోవడంతో ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు ఇచ్చారు. దీంతో ఆమెను మందలించడమే కాక రెండురోజుల తర్వాత పంపిస్తామని ముది గొండలోని అమ్మమ్మ ఇంటికి పంపించారు. అయితే, ‘నేను ఓఅబ్బాయిని ప్రేమిస్తున్నా, ఆఅబ్బాయిని ఏమీ అనవద్దు.. అంటే చనిపోతాను’ అని లేఖ రాసి ఎవరూ లేని సమయాన వెళ్లిపోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆమె కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ ఓ.మురళి తెలిపారు.
చేపల చెరువులో విషప్రయోగం
కారేపల్లి: గుర్తుతెలియని వ్యక్తులు చేపల చెరువులో పురుగుల మందు కలిపి విషప్రయోగానికి పాల్పడ్డా రు. మండలంలోని మాధారంచేపల చెరువులో ఆది వారం రాత్రి దుండగులు పురుగుల మందు కలపగా రూ.10లక్షలవిలువైన చేపలు చనిపోయాయని మత్స్యకారులు వాపోయారు.ఈమేరకు వారి ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.గోపి తెలిపారు.
కల్లూరు డిప్యూటీ
డీఎంహెచ్‌ఓ సరెండర్ ?
ఖమ్మవైద్యవిభాగం: కల్లూరు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సీతారామ్‌ను సరెండర్ చేసినట్లు తెలిసింది. విధుల్లో అలసత్వం ప్రదర్శించినట్లు తేలడంతో ఆయనను వైద్య, ఆరోగ్యశాఖకు సరెండర్ చేస్తూ కలెక్టర్ అనుదీప్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
ఇరవై రోజుల అనంతరం గుర్తింపు


