
పూసం రవికుమారిని సత్కరిస్తున్న నిర్వాహకులు
ఖమ్మంమామిళ్లగూడెం: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో ఈ నెల 18, 19 తేదీల్లో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందులోభాగంగా జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి, మాదిగ రాజకీయ పోరాట వేదిక రాష్ట్ర చైర్మన్ వక్కలగడ్డ సోమచంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం వారు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెటాలని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ 20 శాతానికి పెంచాలని, అందులో మాదిగలకు 12 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాదిగ జేఏసీ జిల్లా అధక్షుడు కిశోర్, ప్రధాన కార్యదర్శి మాతంగి అనిల్‌కుమార్, నాయకులు నామవరపు ఈశ్వర్, సిద్ధాల తిరుమల్‌రావు, గోపాలకృష్ణ, కల్యాణ్, మనోహర్, రాజా, అంబేడ్కర్, విజేత తదితరులు పాల్గొన్నారు.
ఇండోర్ జాతీయ సమావేశాలకు సోమశేఖర్
భద్రాచలం: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ నెల 15 నుంచి 17 వరకు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిరస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యాన జరిగే జాతీయ సమావేశాలకు తొలిసారి భద్రాచలంకు చెందిన కెమిస్ట్ పరిమి సోమశేఖర్‌కు ఆహ్వానం అందింది. దేశస్థాయిలో జరిగే ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశం అత్యంత అరుదుగా ఉండడం గమనార్హం. గత 23 ఏళ్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాచలం డివిజన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోసియేషన్‌లో పలు హోదాలలో పనిచేసి విశిష్ట సేవలు అందించిన ఆయన ప్రస్తుతం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ.. తనకిచ్చిన ఈ అవకాశాన్ని కెమిస్ట్‌ల సమస్యలను జాతీయ స్థాయిలో చర్చించడానికి సద్వినియోగం చేస్తానని తెలిపారు.
విశ్రాంత ఉపాధ్యాయురాలికి ‘మహానంది’ అవార్డు
భద్రాచలం: భద్రాచలానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు, మానవ హక్కుల సంఘం జిల్లా సెక్రటరీ పూసం రవికుమారికు మహానంది జాతీయ అవార్డు వరించింది. సామాజిక, కళా, విద్యారంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఈ అవార్డును నిర్వాహకులు ప్రకటించారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో ఏఎన్‌ఎస్ 24 సంస్థ ఆధ్వర్యాన జరిగిన మహానంది పురస్కార మహోత్సవ కార్యక్రమంలో ఆమెను ఘనంగా సత్కరించి అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన మానుకొండ నాగరాజు, డాక్టర్ చింతపట్ల వెంకటాచారి, అశోక్‌కుమార్, రవీంద్ర ఆచార్యులు, వనపర్తి పద్మావతిలు పాల్గొన్నారు.
‘మహాలక్ష్మి’ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది..
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
సింగరేణి(కొత్తగూడెం): నూతనంగ ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం చరిత్రలో చిరస్థాయిగా నిలు స్తుందని కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం బస్టాండ్‌లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంలో పథకాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి, మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయడం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమవుతుందన్నారు. మహిళల కష్టాలను గుర్తించి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడం అభినందనీయమని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకంలో భాగమైన రూ.500లకు వంట గ్యాస్ సిలిండర్ కొద్దిరోజుల్లోనే అమల్లోకి వస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతీ సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతీ పేదవాడి గడపకు చేరేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీచైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఆర్డీఓ శిరీష, కౌన్సిలర్ ధర్మరాజు, డిపో మేనేజర్ బాణాల వెంకటేశ్వర్లు, సునీత, కందుల భాస్కర్, వంగా వెంకట్, బొంకురు పరమేశ్, రత్నకుమారి, ధనలక్ష్మి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పిడమర్తి రవి, సోమచంద్రశేఖర్

పరిమి సోమశేఖర్