●శ్రీవారికి చక్రస్నానం, మహాపూర్ణాహుతి

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈసందర్భంగా శ్రీస్వామి వారి యాగశాలలో ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ ఆధ్వార్యన మహా పూర్ణాహుతి నిర్వహించారు. అలాగే, ఉత్సవాల ముగింపు సూచికగా ధ్వజావరోహణం చేశారు. ఆతర్వాత ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో(కోనేరు) శ్రీవారికి చక్రస్నానం చేయించారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, ధర్మకర్త ఉప్పల కృష్ణమోహన్‌శర్మ, ఉద్యోగులు శ్రీనివాస్, విజయకుమారి, ఉప ప్రధాన అర్చకులు ఉప్పల విజయదేవశర్మ, ముఖ్య అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, రామకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.