భర్తతో విడిపోయి బతుకుతోంది.. లవ్‌ యూ అంటూ సహోద్యోగి వచ్చి.. చివరకు.. 

Man Throws Acid On Colleague At Bengaluru - Sakshi

సమాజంలో కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. మహిళలపై దాడులు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా పెళ్లై, ముగ్గురు పిల్లలున్న ఓ మహిళలను ప్రేమిస్తున్నానని వెంటపడి చివరకు ఆమెపై యాసిడ్‌ చేశాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. బెంగళూర్‌లోని అగర్‌బత్తి కంపెనీలో బాధితురాలు(32), అహ్మాద్‌(36) కలిసి పనిచేస్తున్నారు. కాగా, బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉండగా.. ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుని జీవనం కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.. కంపెనీ పనిచేస్తున్న క్రమంలో బాధితురాలితో అహ్మద్‌ మధ్య పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా వారిద్దరూ అదే కంపెనీలో పనిచేస్తున్నారు.

అయితే, కొద్దిరోజుల నుంచి బాధితురాలితో తనను ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని అహ్మాద్‌ అడిగాడు. దీనికి ఆమె నిరాకరించింది. తన పిల్లలతో జీవిస్తానంటూ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ అహ్మాద్‌ ఆమెపై ఒత్తిడి చేశాడు. బాధితురాలు ఒప్పుకోకపోవడంతో కక్షగట్టిన అహ్మాద్‌ శుక్రవారం.. ఆమెపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆమె కంటికి తీవ్ర గాయం కాగా.. వెంటనే బాధితురాలని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితుడు అహ్మాద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణ హత్య చేసిన ఫుట్‌బాలర్‌

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top