రాయచూరు రూరల్ : జీవితంలో త్వరగా కోటీశ్వరులు కావాలనే అత్యాశతో నిరుద్యోగ యువకులు, మహిళలు ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పాస్తామంటూ మహిళలకు ఇంటి వద్దే ఉండి వర్క్ ఫ్రం హోం పేరుతో నెలకు రూ.25 వేలు సంపాదించవచ్చంటూ మోసం చేసి రూ.10 కోట్ల మేర నిధులు కాజేసి వినియోగదారులకు కుచ్చుటోపీ పెట్టి పరారైన దంపతుల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుమకూరు, మైసూరు, రాయచూరుల్లో ఏకకాలంలో ఎస్‌ఎల్‌వీ మహిళా మార్ట్ మార్కెటింగ్ పేరుతో జైలు వద్ద కార్యాలయం ప్రారంభించి టోపీ వేయడంతో మహిళలు, నిరుద్యోగ యువకులు వీధిన పడ్డారు. కొంత మంది బంగారు నగలు విక్రయించి మరీ పెట్టుబడి పెట్టారు. జిల్లాలో 250 మందికి పైగా మోసపోయారు. కమల, బొమ్మల రాజేష్ కోట్లాది రూపాయలను దండుకొని పరారయ్యారు. కమల, బొమ్మల రాజేష్‌ల ఆచూకీ కోసం పెట్టుబడి పెట్టిన వారంతా గాలిస్తున్నారు.
మహిళా మార్ట్‌లో రూ.కోట్లలో లావాదేవీలు
మహిళలు, నిరుద్యోగ యువతకు కుచ్చుటోపీ
తుమకూరు, మైసూరుల్లోనూ నయవంచన


