మేం డాక్టర్స్
శివాజీనగర: కన్నడనాట నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంకా బలపడలేదు, చిన్నా చితకా వర్షాలు తప్ప ఆశించిన స్థాయిలో వానలు లేకపోవడంతో అటు రైతుల్లో, ఇటు ప్రభుత్వంలో గుబులు నెలకొంది. జలాశయాల్లో నీటి స్థాయి తగ్గిపోయింది. మునుముందు రోజుల్లో వర్షాలు పుంజుకోకపోతే తాగునీటికి కూడా అవస్థలు పడాల్సిన వస్తుంది. జూన్ తొలి వారంలో సాధారణం కంటే 21 శాతం తక్కువ వర్షమే కురిసింది. వర్షాభావం నేపథ్యంలో నూతన ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ సోమవారం బెంగళూరులో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. వర్షం కొరత కొనసాగితే కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. బెంగళూరుతో పాటుగా రాష్ట్రంలో దక్షిణ భాగాలకు సాగు తాగునీరు అందించే కావేరి నది పరీవాహక ప్రాంతాలలోనూ 36 శాతం లోటు వర్షమే కురిసింది. అంతేకాకుండగా కోస్తా ప్రాంతంలో 41 శాతం వర్షం తక్కువగా ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ 23 వరకు వర్షాభావం కొనసాగవచ్చు. ఆ తరువాతే వానలు వేగం పుంజుకునే అవకాశముంది. తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు.


