పల్స్‌పోలియోలో వందశాతం లక్ష్యాన్ని సాధిద్దాం
కోలారు: జాతీయ పల్స్ పోలియో టీకా కార్యక్రమంలో భాగంగా వందశాతం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులు 1,63, 508 మంది ఉన్నారన్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు వీరందరికీ చుక్కల మందు వేస్తామన్నారు. ఇందు కోసం 738 బూత్‌లు ఏర్పాటు చేసి 37 బృందాలను నియమించిట్లు తెలిపారు. 21వ తేదీ ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, బస్టాండు, రైల్వే స్టేషన్లలో చుక్కలమందు వేస్తారన్నారు. 22, 23, 24 తేదీల్లో పారా మెడికల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేస్తారన్నారు. సమావేశంలో ఆర్‌సిహెచ్, జాతీయ పల్స్ పోలియో జిల్లా నోడల్ అధికారి డాక్టర్ చారిణి, జిల్లా ఆరోగ్య శిక్షణాధికారి ప్రేమ పాల్గొన్నారు.


