విద్యార్థులకు చట్టాలపై జాగృతి అవసరం
రాయచూరు రూరల్: విద్యార్థులకు చట్టం, న్యాయంపై జాగృతి అవసరమని తాలూకా విద్యా శాఖాధికారి ఈరణ్ణ కోస్గి పేర్కొన్నారు. మంగళవారం రాయచూరు తాలూకా గాణదాళ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా యంత్రాంగం, జెడ్పీ, జిల్లా న్యాయ సేవా ప్రాధికార, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, జిల్లా మహిళా సబలీకరణ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. లైంగిక దాడుల నుంచి మహిళల సంరక్షణ మనందరి బాధ్యత అన్నారు. సాంఘీక దురాచారాలైన బాల్య వివాహాలు, బాల కార్మిక, దేవదాసి పద్ధతి వంటి వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.


