క్రస్ట్‌గేట్ల తయారీ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

క్రస్ట్‌గేట్ల తయారీ పనుల పరిశీలన

Nov 7 2025 8:11 AM | Updated on Nov 7 2025 8:11 AM

క్రస్ట్‌గేట్ల తయారీ  పనుల పరిశీలన

క్రస్ట్‌గేట్ల తయారీ పనుల పరిశీలన

హొసపేటె: టీబీ డ్యాం ఎస్టేట్‌ ఆవరణలో చేపడుతున్న డ్యాం క్రస్ట్‌గేట్ల నిర్మాణ పనులను గురువారం తుంగభద్ర మండలి రిటైర్డ్‌ చైర్మన్‌ రంగారెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు. గేట్ల నిర్మాణ పనులను నాణ్యతగా చేపడుతున్న తీరును చూసి అధికారులను అభినందించారు. పనులను వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టరుకు సూచించారు. అదే విధంగా గదగ్‌లో కూడా చేపట్టిన డ్యాం గేట్ల నిర్మాణ పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుతం రెండు చోట్ల డ్యాంకు సంబంధించిన 32 గేట్ల నిర్మాణ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని మండలి అధికారులు ఆయనకు తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వ 79 టీఎంసీల వరకు ఉన్నందున కొత్త గేట్లను ఏర్పాటు చేసేందుకు కాలావకాశం పడుతుందని, నీటి నిల్వ పూర్తిగా తగ్గితే మార్చేందుకు అనుకూలం అవుతుందని మండలి అధికారులు తెలిపారు. మండలి కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్‌, డ్యాం సెక్షన్‌ అధికారి జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement