అక్రమ బియ్యం పట్టివేత
రాయచూరు రూరల్: క్రీడాకారుల హాస్టల్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన బియాన్ని అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. యాదగిరి జిల్లా క్రీడాంగణంలో బుధవారం సాయంత్రం యాదగరి నగరసభ అధ్యక్షురాలు లలితా అనపూరే ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. నల్ల బజారులో విక్రయించే ఆహర పదార్థలను తెచ్చి హాస్టల్ విద్యార్థులకు భోజనం వడ్డించడంపై పౌర సరఫరాల శాఖ అధికారిని పిలిచి ఆరా తీయించారు. బాల, బాలికలకు ప్రత్యేక గదులు లేకపోవడంతో వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో అక్రమ బియ్యం నిల్వ ఉండటంతో అధికారులను మందలించారు. యాదగిరి జిల్లాలో అక్రమ బియ్యంపై సీఐడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గురుమిఠకల్ తాలుకాలో అక్రమ బియ్యం పట్టివేతపై విచారణ జరుగుతోందని వివరించారు. బియ్యాన్ని పాలిష్ చేసి వాటిని ఏజెన్సీల ద్వారా హాస్టల్‌కు సరఫరా చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. అన్నభాగ్య బియ్యం సరఫరా చేసినట్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.


