ప్రథమ చికిత్సపై అవగాహన అవసరం
బళ్లారి రూరల్: ప్రథమ చికిత్సపై యువ రెడ్‌క్రాస్ సభ్యులందరికీ అవగాహన ఉండాలని రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షుడు భాస్కర్‌రావు తెలిపారు. గురువారం వీఎస్‌కేయూ అంబేడ్కర్ సభా భవన్‌లో యువ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులకు ప్రథమ చికిత్సపై జాగృతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ.. అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీకి నాలుగు సార్లు నోబెల్ శాంతి పురష్కారం దక్కిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో రెడ్‌క్రాస్ సొసైటీ బ్రాంచ్‌లు ఉన్నట్లు వెల్లడించారు. మానవీయ విలువలను విశ్వానికి తెలియజేయడమే రెడ్‌క్రాస్ సొసైటీ ప్రధాన లక్ష్యమన్నారు. విషమ పరిస్థితుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం రెడ్‌క్రాస్ శిక్షణతో సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సద్యోజాతప్ప ఎస్.బళ్లారి రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి ఎం.ఎ.షకీబ్, రాష్ట్ర కార్యదర్శి ఉమాకాంత్, విశ్వవిద్యాలయ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రముఖుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


