ముఖ్యమంత్రి పర్యటన జయప్రదం చేయండి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో 74 చెరువులకు నీరు నింపే ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య నవంబర్ 9వ తేదీన వస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా చేపట్టి విజయవంతం చేయాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి సూచించారు. బుధవారం విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాలూకా స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ప్రాథమిక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి 30 వేల మందికి పైగా ప్రజలు చేరే అవకాశం ఉందన్నారు. పోలీస్ శాఖ దృఢ సంకల్పంతో బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. ఎంపీ తుకారాం, ఎమ్మెల్యే శ్రీనివాస్, ఎస్పీ జాహ్నవి పాల్గొన్నారు.
అంత్యక్రియలకు ఆపసోపాలే.!
రాయచూరు రూరల్ : గ్రామంలో మనిషి చనిపోతే అంత్యక్రియలు జరపడానికి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం సిరవార తాలూకా మల్లటలో శఽవసంస్కారానికి ప్రజలు నానా పాట్లు పడ్డారు. గ్రామంలో దళిత వ్యక్తి మృతి చెందడంతో శవ సంస్కారం కోసం కిలోమీటర్ల దూరం చొప్పున మృతదేహాన్ని మోసుకొని వాగులో గుండా నడిచి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.


