పురుగుల బియ్యం శుభ్రం
రాయచూరు రూరల్ : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద అందించే ఆహార పదార్థాలకు పురుగులు పట్టాయి. దీంతో ఆ బియ్యాన్ని శుభ్రం చేయడానికి ఉపాధ్యాయులు నడుం బిగించిన ఘటన బుధవారం యాదగిరి తాలూకా అరకేర(కె)లో జరిగింది. 20 రోజుల పాటు దీపావళి పండుగతో పాటు కుల గణన సమీక్షలో పాల్గొనడంతో స్టోర్ రూంలో నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలకు పురుగులు పట్టడంతో శుభ్రం చేసే యంత్రం ద్వారా బియ్యాన్ని శుభ్రం చేశారు. ఏడు క్వింటాళ్ల బియ్యం, ఆరు క్వింటాళ్ల గోధుమలు, క్వింటాల్ కంది పప్పులను శుభ్ర పరిచినట్లు ప్రధానోపాధ్యాయుడు చంద్ర నాయక్ తెలిపారు. ఉపాధ్యాయులు సాబణ్ణ, కాశప్ప, రేణుక, నరసమ్మ, విద్యాశ్రీ, అనురాధ, భీమా బాయి స్వంత ఖర్చుతో యంత్రాన్ని తెచ్చి వాటిని శుభ్రం చేయించారన్నారు.
ఉజ్వల భవిష్యత్తుకు
కళాశాల విద్య నాంది
రాయచూరు రూరల్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కళాశాల విద్య నాంది కావాలని రాయచూరు డీఎస్పీ శాంతవీర పేర్కొన్నారు. బుధవారం సేట్ చున్నీలాల్ అమర్‌చంద్ బోహర న్యాయ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యా శాఖలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు పిల్లల సంక్షేమ కోసం పాటుపడాలన్నారు. ప్రతిభకు తార్కాణంగా విద్యార్థుల భవిష్యత్తును రూపొందించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు తార్కాణం కావాలన్నారు.


