మంత్రి జమీర్.. జొన్నల పంచాయతీ
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం సమీపంలో పెరేసంద్ర గ్రామంలో జొన్నల వ్యాపారి రామక్రిష్ణప్ప హైదరాబాద్‌లోని అబ్దుల్ రజాక్, అక్బర్ బాషా, నసీర్ అనే దళారులకు జొన్నల లోడ్ లను పంపారు, సుమారు రూ. 1.89 కోట్లను వారు రామక్రిష్ణప్పకు చెల్లించాలి. అయితే డబ్బులు ఇవ్వడం లేదు, బాధితుడు పేరేసంద్ర ఠాణాలో ఫిర్యాదు చేయగా, సబ్ ఇన్స్‌పెక్టర్ జగదీశ్‌రెడ్డి కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో ఉంటున్న అక్బర్‌ను ఠాణాకు పిలుచుకుని వచ్చారు.
సెటిల్
చేసుకుంటారులే
కథ ఇక్కడే మలుపు తిరిగింది. వ్యాపారిని సీఐ విచారణ చేస్తున్నారు. ఈ సమయంలో గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ ఆఫీసు నుంచి సహాయకుడు లక్ష్మినారాయణ ఠాణాకు కాల్ చేసి, మంత్రి మీతో మాట్లాడతారని ఫోన్‌ను మంత్రికి ఇచ్చారు, అప్పుడు మంత్రి జమీర్ అహ్మద్ సీన్‌లోకి వచ్చారు, సమస్తే బ్రదర్, మన బంధువు హైదరాబాద్ లో ఉంటున్న అక్బర్ ని ఇక్కడ ఎవరికో డబ్బులు ఇవ్వాలని పిలుచుకు వచ్చారట, ఏమి కేసు అది? అని అన్నారు. అప్పుడు ఎస్‌ఐ జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ జొన్నల వ్యాపాకి డబ్బులు ఇవ్వాలి, అన్ని రికార్డులు ఉన్నాయి, వారి పైన ఎఫ్‌ఐఆర్ అయింది, అందుకోసం వారిని పిలుచుకు వచ్చాము అన్నారు. తరువాత మంత్రి మాట్లాడుతూ అది అంత మొత్తం కాదు, కూర్చొని సెటిల్‌మెంట్ చేసుకుంటారట, మేము ఆ పని చేస్తాము, మీరు వారిని వదిలిపెట్టండి అని సూచించారు. మంత్రి జొన్నల పంచాయతీ ఆడియో వైరల్ అయింది. బాధితుడు రామక్రిష్ణప్ప మాట్లాడుతు రైతులకు సహాయం చేయవలసిన మంత్రి ఇలా చేస్తే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నాకు కూర్చుంటామని తెలిపారు.
అరెస్టు చేసిన వ్యక్తికి వత్తాసు
వదిలేయాలని ఎస్‌ఐకి ఫోన్
రైతుకు రూ.1.89 కోట్ల బాకీ పడిన నిందితులు


