● బ్రెజిల్ మోడల్‌లతో అసభ్య ప్రవర్తన
కృష్ణరాజపురం: బెంగళూరులో బస చేసిన బ్రెజిల్ మోడల్ భామలపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్లింకెట్ డెలివరీ బాయ్‌ని ఆర్‌టీ నగర పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. బ్రెజిల్‌కు చెందిన ముగ్గురు మోడల్స్ సుల్తాన్‌పాళ్యలో నివసిస్తున్నారు. ఈ నెల 17న నిత్యావసరాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశారు. ఆర్డర్ డెలివరీకి వెళ్లిన డిప్లొమా ఇంజనీరింగ్ విద్యార్థి కుమార్.. వారిని చూడగానే అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సుందరాంగులు మండిపడడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటనపై మోడల్స్ తమ కంపెనీ యజమాని కార్తీక్‌కు తెలిపారు. ఆయన ఆర్‌టీనగర పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
గ్యాంగ్ రేప్ కేసులో మరొకరు..
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని మాదనాయకనహళ్లిలో వివాహిత మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ముఖ్య నిందితుడిని అరెస్టు చేశారు. దీపావళి పండుగ రోజున గంగొండనహళ్లిలో పశ్చిమబెంగాల్ బ్యూటిషియన్ ఇంట్లోకి ఆరుమంది దుండగులు చొరబడి అత్యాచారం చేసి, ఆమె కుటుంబీకులను చితకబాది పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుమందిని అరెస్టు చేయగా ప్రముఖ నిందితుడు ఏ1 మిథున్ ఇప్పుడు దొరికాడు. నిందితుల్లో ఇద్దరు మైనర్ బాలలు ఉన్నారు.


