గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదాలు అరికట్టండి | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదాలు అరికట్టండి

Oct 24 2025 2:46 AM | Updated on Oct 24 2025 2:46 AM

గ్యాస

గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదాలు అరికట్టండి

హొసపేటె: జిల్లాలో వంట గ్యాస్‌ సిలిండర్ల వాడకంలో తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాల గురించి ప్రజలకు తెలియజేయడం ద్వారా గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదాలను అరికట్టాలని జిల్లాధికారిణి కవిత అధికారులకు సూచించారు. వంట గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేసే, రవాణా చేసే, నిల్వ చేసే గ్యాస్‌ ఏజెన్సీల నిర్వహణపై నగరంలోని జిల్లాధికారి సభాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. అత్యవసర సమయాల్లో గృహ వంట సిలిండర్ల వినియోగదారులు 1906 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఉపయోగించుకోవాలన్నారు. గృహ గ్యాస్‌ వినియోదారుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. వినియోగదారుల నుంచి ఏవైనా ఫిర్యాదులు వచ్చిన వెంటనే సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

నిర్లక్ష్యం వహిస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటాం. బుకింగ్‌ చేసిన 48 గంటల్లోపు గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేయాలి. జిల్లాలో గృహ సిలిండర్ల సరఫరా తగినంతగా ఉండేలా చూసుకోవాలి. గృహ సిలిండర్ల కొరత లేకుండా చూసుకోవడానికి స్టాక్‌ను సక్రమంగా నిర్వహించాలి. ఉజ్వల పథకం లబ్ధిదారుల ఈ–కేవైసీ తప్పనిసరి చేయాలి. సిలిండర్‌ గృహ వినియోగదారుల కోసం భద్రతా నియమాలు (ఎస్‌ఓపీ) ముద్రించి, ప్రతి సిలిండర్‌తో పాటు వారి ఇళ్లకు పంపిణీ చేయాలి. గృహిణులకు వంట గ్యాస్‌ సిలిండర్ల వాడకం గురించి సమాచారం అందించాలి. ప్రతి గ్యాస్‌ ఏజెన్సీ తమ పరిధిలోని గ్రామాలు, వార్డులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. గాదిగనూరు గ్రామంలో ఇటీవల జరిగిన సిలిండర్‌ పేలుడు సంఘటనపై మనం మేల్కోనాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా మనం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి

ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రియాజ్‌ మాట్లాడుతూ గృహ గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులు గ్యాస్‌ స్టౌ పైపును అగ్ని నిరోధక పైపుతో భర్తీ చేయాలని అన్నారు. అధికారిక గ్యాస్‌ సరఫరాదారుల నుంచి మాత్రమే గ్యాస్‌ సిలిండర్లను కొనుగోలు చేయాలి. సిలిండర్‌పై సంబంధిత కంపెనీ సీల్‌, క్యాప్‌ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. ఇళ్లలో సిలిండర్లను వెంటిలేషన్‌ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. రాత్రి నిద్రపోతున్నప్పుడు గ్యాస్‌ స్టౌ ఆపివేశారా లేదా అని తనిఖీ చేయాలి. సిలిండర్లను వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. గ్యాస్‌ ఏజెన్సీ యజమానులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదాలు అరికట్టండి1
1/1

గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదాలు అరికట్టండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement