చెన్నమ్మ ధైర్య సాహసాలు ఆదర్శప్రాయం
హొసపేటె: బ్రిటిష్ వారికి ఎదురొడ్డి ధైర్యంగా పోరాడి దేశ స్వాతంత్య్రం కోసం వీర సైనికులను పెంచిన తొలి మహిళా పోరాట యోధురాలు కిత్తూరు రాణి చెన్నమ్మ ధైర్యసాహసాలు నేటి మహిళలకు ఆదర్శప్రాయమని జిల్లాధికారిణి కవితా ఎస్.మన్నికేరి అన్నారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన కిత్తూరు రాణి చెన్నమ్మ జయంతిని చెన్నమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడారు. వీర వనిత కిత్తూరు రాణి చెన్నమ్మ ఇప్పటికీ మహిళా సమాజానికి గొప్ప ప్రేరణ అన్నారు. ఆమె దృఢ సంకల్పం, పోరాట స్పూర్తి, ప్రతి సీ్త్ర అన్యాయానికి వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచడానికి ప్రేరేపిస్తుందన్నారు. పురుషాధిక్య సమాజంలో కూడా ఆమె సమర్ధవంతంగా పాలించారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలను కాపాడిందన్నారు. పరిపాలన, రాజకీయాలు సహా ఏ రంగంలోనైనా మహిళలు విజయవంతమైన నాయకులుగా ఎదగగలరని ఆమె నిరూపించారన్నారు. చిన్నతనంలోనే ఆమె గుర్రపు స్వారీ, కత్తిసాము, విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించారన్నారు. నేటి మహిళలు కూడా ఆత్మరక్షణ కోసం కొన్ని నైపుణ్యాలను నేర్చుకోవాలన్నారు. అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప, జిల్లా పంచాయతీ ఉప కార్యదర్శి కే.తిమ్మప్ప, కన్నడ, సంస్కృతి శాఖ సహాయ సంచాలకులు సిద్దలింగేష్ రంగన్నవర్, వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు గొగ్గ చెన్నబసవరాజ్, ప్రధాన కార్యదర్శి నీలకంఠగౌడ, ప్రముఖ కిచిడి కొట్రేష్, మధుర చెన్నశాస్త్రి, సోమ బసవరాజ్, రవిశంకర్, శరణ బసవరాజ్ ఎల్.కోతంబరి, శివపుత్రప్ప, కాశీనాథయ్య, చిత్తప్ప, మల్లికార్జున్ మేస్త్రి, విశ్వనాథ్, గౌళి రుద్రప్ప, మల్లేశప్ప, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
రాయచూరులో..
రాయచూరు రూరల్: నగరంలో కిత్తూరు రాణి చెన్నమ్మ జయంతిని గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో నిర్వహించారు. ముందుగా కిత్తూరు రాణి చెన్నమ్మ చిత్రపటానికి రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పూజలు చేశారు. అనంతరం రంగమందిరంలో జరిగిన సమావేశంలో అదనపు ఎస్పీ కుమారస్వామి మాట్లాడారు. బాల్యం నుంచి గుర్రపు స్వారీ చేస్తూ కత్తి పట్టుకొని యుద్ధం చేయడానికి తర్ఫీదు పొందిన ఆమె బ్రిటిష్ సైనికులతో యుద్ధ విజయాలలో ఓటమి ఎరుగని ధీరురాలిగా పేరొందారన్నారు. కార్యక్రమంలో పంచ గ్యారెంటీల సమితి అధ్యక్షుడు పవన్ పాటిల్, పరమేశ్వర సాలిమట్‌్, ఉదయ్ కుమార్, తహసీల్దార్ పరశురాం, చంద్రశేఖర్, విజయలక్ష్మి, నిర్మల బెణ్ణి, సులోచన, జ్యోతి, సరోజ, ఈరమ్మ, నాగనగౌడ, మహంతేష్ పాటిల్, దండెప్పలున్నారు.
చెన్నమ్మ ధైర్య సాహసాలు ఆదర్శప్రాయం


