సతీష్ జార్కిహోళి సీఎం అయితే సంతోషమే
సాక్షి బళ్లారి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మారుస్తారనే వదంతులు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడే సిద్ధూ తర్వాత జార్కిహోళి సమర్ధవంతమైన నాయకుడని పేర్కొన్న నేపథ్యంలో వాల్మీకి సముదాయానికి చెందిన సతీష్ జార్కిహోళి ముఖ్యమంత్రి అయితే తమకు సంతోషమేనని వ్యక్తిగతంగా తన మద్దతు కూడా ఉంటుందని మాజీ మంత్రి బీ.శ్రీరాములు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన అస్తవ్యస్తంగా మారిందని, కుర్చీ కోసం రాజకీయం చేస్తున్నారే కాని జనం సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ(అత్యవసర) పాలన ఏ విధంగా కొనసాగిందో అదే తరహాలో రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే ఉపముఖ్యమంత్రిని చేయడానికి చేస్తున్న రాజకీయాలు జనం గమనిస్తున్నారన్నారు.
కాంగ్రెస్‌వి కక్షసాధింపు రాజకీయాలు
ఆర్‌ఎస్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేవారిపై కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు రాజకీయాలు చేస్తుందన్నారు. నవంబర్‌లో రాష్ట్రంలో రాజకీయ మార్పులు ఉంటాయని తుమకూరు ఎమ్మెల్యే రాజన్న పేర్కొన్న నేపథ్యంలో ఆయనతో రాజీనామా చేయించారన్నారు. ప్రియాంక్ ఖర్గేని డీసీఎం చేయడానికి చర్చ కూడా జరిగినట్లు తెలుస్తుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కి మద్దతు ఇచ్చిన వారిని, భారత్ మాతాకీ జై అన్నవారిని జైలుకు పంపుతున్నారని అదే పాకిస్థాన్ కో జై అన్నవారిని రాజ్యసభకు పంపుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్సీల అధికారావధి ముగిసిందని, బీజేపీ తరఫున నియమించేందుకు పార్టీ అధ్యక్షుడు సమావేశం నిర్వహించి కేంద్ర నాయకులకు పేరు పంపుతారన్నారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆయన పార్టీ కోసం ఎంతో శ్రమించారు
రాష్ట్రంలో అస్తవ్యస్తంగా సర్కారు పరిపాలన
1975లో ఇందిరాగాంధీ పాలనను తలపిస్తోంది
ప్రియాంక్ ఖర్గేని డీసీఎం
చేయడానికి యత్నం
విలేకరులతో మాజీ మంత్రి శ్రీరాములు


