అకాల వర్ష బీభత్సం.. వరి పైరుకు నష్టం
రాయచూరు రూరల్: అకాల వర్ష బీభత్సంతో కోతకొచ్చిన వరి పైరు నష్టం అంచు కోంది. దేవదుర్గ, సింధనూరు తాలూకాలో వేలాది ఎకరాల్లో పంట ఒరిగింది. శుక్రవారం సాయంత్రం రెండు తాలూకాల్లో వర్షాలు కురవడంతో రైతుల నోటిలో మట్టి పడినట్లయింది. సింధనూరు తాలూకా రౌడకుంద, జవళగేర, రాగలపర్వి, బూదిహాళ క్యాంప్, హుడా, గొరేబాళ్, సోమలాపుర వంటి ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. దేవదుర్గ తాలూకా జాలహళ్లి, చప్పళికి ఇతర ప్రాంతాల్లో రైతులు వేసుకున్న వరి పంటలు చేతికొచ్చే సమయంలో వరుణ దేవుడు కరుణించక కాటు వేశాడని రైతులు చింతిస్తున్నారు. గురువారం విధాన పరిషత్ సభ్యుడు బసనగౌడ బాదర్లి అకాల వర్షంతో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు.
అకాల వర్ష బీభత్సం.. వరి పైరుకు నష్టం


