
సిస్టోబాల్ క్రీడా ప్రతిభకు పేదరికం అడ్డు
రాయచూరు రూరల్: గుమ్మట నగరి విజయపుర జిల్లాలో ప్రతిభావంతులకు కొదవ లేదు. క్రీడలు, సాహిత్యం, టెక్నాలజీ, వ్యవసాయం, రాజకీయం వంటి క్షేత్రాలకు పేరొందిన జిల్లా విజయపుర. అలాంటి కోవకు చెందిన వారిలో ఒక్కరు క్రీడాకారిణి అక్షతా తారాపుర. సిస్టోబాల్ క్రీడా పోటీల్లో మహిళ క్రీడా ప్రతిభ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. థాయిలాండ్‌లో జరిగే పోటీల్లో పాల్గొనడానికి అర్థిక స్థోమత లేక భారతదేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో పేరును నిలబెట్టడానికి చేస్తున్న పోరాటం చెప్పనలవి కాదు. క్రీడాకారిణి అక్షతా తారాపుర విజయపుర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. తల్లి యశోద ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఆయాగా విధులు నిర్వహిస్తోంది. తండ్రి వినాయక్‌కు చెవి వినబడదు, కళ్లు కనబడవు.
ఆర్ధిక స్థోమత లేక ఎదగలేక పోతున్న క్రీడాకారిణి అక్షతా తారాపుర
దాతలు ఆదుకుంటే అంతర్జాతీయ స్థాయి పోటీలకు సంసిద్ధం
భారంగా కుటుంబ పోషణ
తల్లి యశోద జీతంతో తండ్రి ఆరోగ్యం, కుటుంబ పోషణ భారంగా మారిన తరుణంలో రెండేళ్ల క్రితం జాతీయ స్థాయి సిస్టోబాల్ క్రీడా పోటీల్లో విజయం సాధించానన్నారు. థాయిలాండ్‌లో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆడటానికి రూ.లక్ష మేర ఖర్చవుతుందని, ఆ ఖర్చు భరించే శక్తి లేక దేశం తరపున క్రీడల్లో పాల్గొనలేక పోతున్నానని విచారం వ్యక్తం చేశారు. తనకు థాయిలాండ్ వెళ్లడానికి ఆర్ధిక సహాయం చేయాలని అర్థిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి థాయిలాండ్‌లో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆడటానికి వెళ్లలేక పోతున్నానన్నారు. తన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ పొదుపు ఖాతా సంఖ్య– 89079374049కు దాతలు ఆర్థిక సహాయం చేయాలని అక్షతా అభ్యర్థించారు.

సిస్టోబాల్ క్రీడా ప్రతిభకు పేదరికం అడ్డు

సిస్టోబాల్ క్రీడా ప్రతిభకు పేదరికం అడ్డు