
బీజేపీకే నవంబర్ విప్లవం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విప్లవం లేదని, అది కేవలం బీజేపీ నేతల భ్రమ అని, బీజేపీలో నవంబర్‌లో విప్లవం రానుందని, దేశానికి నూతన ప్రధానమంత్రి పీఠం ఎక్కుతారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ జోస్యం చెప్పారు. బుధవారం కలబుర్గి, యాదగిరి, రాయచూరులో కార్మికులకు స్మార్ట్‌కార్డులు పంపిణీ చేసి విలేకరులతో మాట్లాడారు. నితిన్ గడ్కరీ దేశ ప్రధానమంత్రి అవుతారని వెల్లడించారు. భారతీయులకు దేశభక్తి ఉందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏమీ లేదన్నారు. తనకు బీజేపీలో ఆప్త మిత్రులున్నారన్నారు. వారి నుంచి సమాచారం అందిందన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కేబినెట్‌లో మార్పులు చేర్పులు జరుగుతాయన్నారు. కేంద్ర సర్కార్ వద్ద నిధులున్నాయని, ఎన్నికల్లో విజయం సాధిస్తారని, ప్రామాణిక ఓట్లతో గెలవడం బీజేపీకి కష్ట సాధ్యమని అన్నారు.
యాదగిరి జిల్లాధికారిపై మండిపాటు
బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ యాదగిరి జిల్లాధికారిపై మండిపడిన ఘటన చోటు చేసుకుంది. మంత్రి ప్రభుత్వ అతిథి భవనంలో 9 గంటలకు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి జిల్లాధికారి హర్షల్ బోయర్ 40 నిమిషాల పాటు ఆలస్యంగా రావడంతో అధికారిపై చిందులు తొక్కారు. మంత్రి వెంట మరో మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్, శాసన సభ్యులు శరణే గౌడ కందకూరు, చెన్నారెడ్డి పాటిల్ తన్నూరులున్నారు.
దేశానికి కొత్త ప్రధానమంత్రి
మంత్రి సంతోష్ లాడ్ జోస్యం

బీజేపీకే నవంబర్ విప్లవం