
మొబైల్ యాప్‌లలో ట్రాఫిక్
బనశంకరి: సిలికాన్ సిటీలో ట్రాఫిక్ సిగ్నల్ గురించి వాహనదారులకు కచ్చితమైన సమయం లైవ్ అందించడానికి పలు యాప్‌లు సమాచారం అందిస్తున్నాయి.
రాబోయే జంక్షన్‌లో ఎంత వాహన రద్దీ ఉందనేది యాప్‌లో చూసి తెలుసుకోవచ్చు. రియల్ టైమ్‌లో నగర ట్రాఫిక్ సమాచారం లభ్యమవుతుందని వినియోగదారులు తెలిపారు.
ఎలా పనిచేస్తుందంటే...
బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీస్, ఇతరత్రా విభాగాల ద్వారా అనుసంధానమైన ప్రధాన రహదారులు, కూడళ్లలోని ట్రాఫిక్ రద్దీని అనుక్షణం ఈ యాప్‌లు సేకరిస్తూ ఉండేలా సాఫ్ట్‌వేర్ ను రూపొందించారు. వాహనదారులు తమ ముందు ఉన్న సిగ్నల్ మారడానికి ఎంత సమయం ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. బెంగళూరులో 169 జంక్షన్లలో రద్దీని అనుక్షణం గమనించే సాంకేతికతను అమర్చారు. తద్వారా వాహనదారులు మొబైల్‌ఫోన్‌లో వీక్షించవచ్చునని ట్రాఫిక్ విభాగం సీనియర్ అధికారి తెలిపారు.
బెంగళూరులో అందుబాటులోకి