
ఇద్దరు యువకుల దారుణ హత్య
సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్ : విజయపుర జిల్లాలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం విజయపుర జిల్లా కన్నూరు గ్రామంలో సాగర్ బెళుండగి(25), ఇషాక్ ఖురేషి(24) అనే ఇద్దరు యువకులను బండరాళ్లతో తలపై బాది దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ప్రస్తుతం హత్యకు గురైన ఇద్దరు యువకులు రెండేళ్ల క్రితం ఈరనగౌడ అనే వ్యక్తిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఈరనగౌడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో పాతకక్షలతో సాగర్, ఖురేషి అనే యువకులు హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే విజయపుర గ్రామీణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతుల కుటుంబాలకు అప్పగించారు.
విజయపుర జిల్లాలో వెలుగు చూసిన ఘటన
పాత కక్షలతోనే హత్యలుగా పోలీసుల అనుమానం