
సమస్యలు గాలికొదిలి ఓట్ల చోరీ డ్రామా
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రజలు పలు సమస్యలతో నలిగి పోతోంటే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా దొంగ ఓట్ల చోరీ డ్రామా నడిపారని ఆందోళ సిద్దలింగ స్వామి ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అధికార పార్టీ నాయకులపై మండిపడ్డారు. గత నెలలో కురిసిన వానలకు పంటలు, రహదారులు, వంతెనలు భారీ నష్టం సంభవించిందన్నారు. వారికి పరిహారం అందించకుండా ముఖ్యమంత్రి ఆకాశ పర్యటన చేసి రూ.25 వేల కోట్లు పరిహారం ప్రకటించినా కనీసం రూ.25 వేలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో నాయకులకు వ్యతిరేకంగా ప్రియాంక్ ఖర్గే హైడ్రామా నాయకుడన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నిషేధం కోసం సీఎంకు లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. ఉగ్రవాదుల గురించి మాట్లాడే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. దమ్ముంటే ఇండియన్ ముజాహిద్దీన్, లష్కర్ ఏ తోయిబాలను నిషేధించాలని ఖర్గేకు సవాల్ విసిరారు. 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ కూడా పోటీ చేస్తుందన్నారు. మంజునాథ్ బోవి, రాజా రామచంద్రగౌడ, చెన్నప్పగౌడ, రామనగౌడ, వినయ్ సింగ్, హన్మంతు, వినోద్ కుమార్‌లున్నారు.