
పంట నష్టపరిహారం కోసం రాస్తారోకో
రాయచూరు రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు పొలంలో వేసుకున్న పంటలకు నష్టం వాటిల్లడంతో పరిహారంతో పాటు మద్దతు ధరలు ప్రకటించాలని ఒత్తిడి చేస్తూ కలబుర్గి జిల్లా బంద్ చేపట్టారు. సోమవారం అఖిల భారత రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మల్లనగౌడ మాట్లాడారు. అతివృష్టితో కలబుర్గి, బీదర్, యాదగిరి, రాయచూరు జిల్లాల్లో భారీ నష్టం సంభవించిందన్నారు. బస్సుల రాకపోకలు కూడా స్తంభించాయన్నారు. కేంద్ర బస్టాండ్ వద్ద బస్సులను నిలిపి ఆందోళన చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బంద్‌ను పాటించారు. రామ మందిర్, ఖర్గే సర్కిల్, ఆళంద చెక్‌పోస్టుల వద్ద రైతులు గుమిగూడి బంద్ నిర్వహించారు. పత్తికి క్వింటాల్‌కు రూ.10 వేలు మద్దతు ధర కేటాయించాలన్నారు. వర్షాలకు నష్టపోయిన పత్తి పంటలకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు రద్దు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసి జిల్లాధికారిణి ఫౌజియా తరన్నం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. రాయచూరు జిల్లాధికారి కార్యాలయం వద్ద కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు బసవలింగప్ప ఆందోళన చేపట్టారు.
రైతు సంఘాల ఆధ్వర్యంలో కలబుర్గి బంద్
శాంతిభద్రతల రక్షణకు గట్టి పోలీస్ బందోబస్తు

పంట నష్టపరిహారం కోసం రాస్తారోకో