
సుపరిపాలన, అభివృద్ధి కోసమే జీబీఏ
బనశంకరి: వేగంగా విస్తరిస్తున్న బెంగళూరు నగర సమస్త ప్రజలకు సుపరిపాలన, అభివృద్ధి కోసమే గ్రేటర్ బెంగళూరు ప్రాధికార(జీబీఏ)ను అమల్లోకి తెచ్చి ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం గ్రేటర్ బెంగళూరు ప్రాధికార మొదటి సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ఏర్పాటు వెనుక ఉద్దేశాలను ప్రస్తావించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఒకటి కంటే ఎక్కువ కార్పొరేషన్లు ఉంటే అభివృద్ధి సాధ్యమన్న కారణంతో దీనిపై నివేదిక అందించాలని మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కమిటీ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించలేదన్నారు. దీంతో తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన అనంతరం కమిటీని పునః నియమించింది. కమిటీ అందించిన నివేదిక ప్రకారం ముఖ్యమంత్రి అధ్యక్షతన గ్రేటర్‌బెంగళూరు ప్రాధికారను అమల్లోకి తీసుకువచ్చి 5 నగరపాలికేలు ఏర్పాటు చేశామన్నారు. నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలి. రోడ్లు, డ్రైనేజీలు, పుట్‌పాత్, పార్కులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి ఆదర్శపాలికేలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గ్రేటర్‌బెంగళూరు ప్రాధికార పనిచేయాలని అదికారులకు సిద్దరామయ్య సూచించారు. జేబీఏ సమావేశంలో డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, మంత్రులు రామలింగారెడ్డి, కేజే.జార్జ్, జమీర్ అహ్మద్‌ఖాన్, బెంగళూరు నగర ఎమ్మెల్యేలు, డీజీపీ ఎంఏ.సలీం, కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్, కలెక్టర్ జగదీశ్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య

సుపరిపాలన, అభివృద్ధి కోసమే జీబీఏ