
హాసనాంబ దర్శనం.. పులకించిన భక్తజనం
బనశంకరి: హాసన్‌లో కొలువైన హాసనాంబదేవి అమ్మవారు శుక్రవారం భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారి ఆలయ గర్భగుడి తలుపులు తెరిచి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించారు. అంతకుముందు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున కృష్ణబైరేగౌడ ఆలయానికి విచ్చేసి భక్తులకు కల్పించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. షామియానాలు తాగునీరు, మరుగుదొడ్లు, వాహనాలు పార్కింగ్ వ్యవస్థను పరిశీలించారు. ఎంపీ శ్రేయస్‌పటేల్, కలెక్టర్ లతాకుమారి, ఎస్పీ మహమ్మద్‌సుచేతలు ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో వేదికలు నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నామని మంతి తెలిపారు. బెంగళూరు, చైన్నె తదితర ప్రాంతాల్లో తొక్కిసలాట చోటుచేసుకుందని, ఇక్కడ అలాంటి ఘటనలు సంభవించకుండా ముందుజాగ్రత్తచర్యలు తీసుకున్నామని తెలిపారు. శుక్రవారం ఉదయం 10వేలమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, 12వేల మంది క్యూలైన్లలో ఉండగా రాత్రి 7 గంటల వరకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. రోజూ మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు, రాత్రి 2 నుంచి 5 గంటల వరకు అమ్మవారి అలంకరణ, నైవేద్యం కారణంగా దర్శనం నిలిపివేసి మిగిలిన సమయంలో భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు.

హాసనాంబ దర్శనం.. పులకించిన భక్తజనం