
విద్యుత్ షాక్‌తో కూరగాయల విక్రేత మృతి
హొసపేటె: కూరగాయలు అమ్ముతున్న ఒక యువకుడు దుకాణంలో ఉంచిన ఇనుప రాడ్‌ను తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించిన ఘటన పాత సంత మైదానంలోని రోజువారీ కూరగాయల దుకాణంలో సోమవారం రాత్రి జరిగింది. ఈచలబొమ్మనహళ్లి గ్రామ నివాసి సాగర్(25) అనే యువకుడు పాత కూరగాయల మార్కెట్‌లో రోజు కూరగాయలు విక్రయిస్తున్నాడు. అయితే 11కేవీ విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు తెగి కూరగాయల దుకాణంపై పడింది. దీంతో పైకప్పునకు ఉంచిన ఇనుప రాడ్‌కు విద్యుత్ ప్రసారం అయింది. యువకుడు సాగర్ అనుకోకుండా దానిని తాకగా వెంటనే షాక్ తగిలింది. వెంటనే అక్కడ ఉన్న వ్యాపారులు అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యులు విద్యుదాఘాతంతో మృతి చెందాడని ధ్రువీకరించారు. ఈచలబొమ్మనహళ్లి గ్రామానికి చెందిన భూశప్ప ఏకై క కుమారుడు సాగర్. అతను కూరగాయల వ్యాపారి. ప్రస్తుతం రాజీవ్‌గాంధీ నగర్‌లో నివసిస్తున్నాడు. విద్యుదాఘాతంతో మరో పెద్ద కొడుకును కోల్పోయిన కుటుంబం, వారి కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. సాగర్ మరణ వార్త విన్న స్నేహితులు, బంధువులు ఆస్పత్రి ఆవరణకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
కిడ్నీలో రాళ్ల తొలగింపు విజయవంతం
●హుబ్లీ వివేకానంద ఆస్పత్రి వైద్యుల సాధన
రాయచూరు రూరల్: మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్న 43 ఏళ్ల రోగికి డయాలసిస్ ద్వారా వైద్యులు కిడ్నీలో రాళ్లు తొలగించిన ఘటన హుబ్లీ వివేకానంద ఆస్పత్రిలో జరిగింది. హుబ్లీ దేశ్‌పాండేనగర్‌లోని వివేకానంద జనరల్ ఆస్పత్రిలో వైద్యులు నెఫ్రాలజిస్టు డాక్టర్ సిద్దరామ కమతే, యూరాలజిస్ట్ డాక్టర్ పవన్ జోషి, మంజుల హుగ్గిల బృందం ఆపరేషన్ ద్వారా రాళ్లను తొలగించారు. హానగల్‌కు చెందిన వ్యక్తికి రెండు కిడ్నీల్లో 6 సెం.మీ. మేర రాళ్లు ఉండడంతో అన్ని విధాలుగా బాధపడ్డాడు. గత మూడు నెలల నుంచి హుబ్లీ ఆస్పత్రిలో హిమో డయాలసిస్ చేశారు. మధుమేహ, రక్తపోటు, రక్తహీనతతో నలిగిపోయింది. వైద్యుల సలహా మేరకు ఎండోస్కోపితో కిడ్నీలో రాళ్లను తొలగించారు. తక్కువ ఖర్చుతో వైద్యం చేశారని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బ్రతకడం కష్టమని భావించిన కుటుంబ సభ్యులకు పునర్జీవనం కల్పించినట్లైంది.
ఓ తల్లి అవయవదానం
● దావణగెరె జిల్లాలో కుమారుల పెద్ద మనసు
బళ్లారి రూరల్: జీవించినంత కాలం ఇతరులకు సాయపడుతూ ఈ జన్మను సార్థకత చేసుకోవాలనుకొనే వారు ఉండటం సహజం. అయితే తల్లి మరణాంతరం ఇతరుల శరీరంలోని అవయవాల రూపంలో జీవించి ఉండాలని భావించిన బిడ్డలు అవయవదానం చేసి ఆదర్శంగా నిలిచారు. దావణగెరె జిల్లా న్యామతి తాలూకా తెగ్గినహళ్లికి చెందిన మహిళ గాయిత్రమ్మ. తెగ్గినహళ్లికి చెందిన దివంగత బీరప్ప భార్య గాయిత్రమ్మ మెదడుకు సంబంధించిన వ్యాధితో ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ గత శుక్రవారం మృతి చెందింది. తల్లి మృతదేహంలో చలనంలో ఉన్న గుండె, కిడ్నీలు, కాలేయం(లివర్), ఊపిరి తిత్తులు, రెండు కళ్లను మృతురాలు గాయిత్రమ్మ పిల్లలు బెంగళూరు ఏఎల్ రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రికి దానం చేశారు. తల్లి గాయిత్రమ్మ అవయవాలను దానం చేసి ఆమె పిల్లలైన సంతోష, సంగీత, చైత్ర, ప్రశాంత్‌లకు దావణగెరె డీహెచ్‌ఓ డాక్టర్ షణ్ముకప్ప ధన్యవాదాలు తెలిపారు. ఇదే విధంగా పలువురు అవయవాలను దానం చేసి ఆదర్శంగా నిలవాలని కోరారు.
పోలీసు భవనాల నిర్మాణ పనుల పరిశీలన
రాయచూరు రూరల్: రాయచూరులో నిర్మాణం జరుగుతున్న పోలీసు భవనాలను ఎస్పీ పుట్టమాదయ్య పరిశీలించారు. మంగళవారం నగరంలోని పోలీస్ కాలనీలో గదులకు రక్షణ గోడల నిర్మాణాలు, డీఆర్‌ఏ పోలీసు భవనాల నిర్మాణ పనులను ఆయన తనిఖీ చేశారు. పోలీస్ కుటుంబాలకు మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయన వెంట ఏఎస్పీలు కుమారస్వామి, హరీష్, డీఎస్పీ పి శాంతవీర, సీఐలు మేకా నాగరాజ్, ఉమేష్ కాంబ్లే, ఎస్‌ఐ ఈరణ్ణ, నరసమ్మ, లక్ష్మి, శారదలున్నారు.

విద్యుత్ షాక్‌తో కూరగాయల విక్రేత మృతి

విద్యుత్ షాక్‌తో కూరగాయల విక్రేత మృతి

విద్యుత్ షాక్‌తో కూరగాయల విక్రేత మృతి

విద్యుత్ షాక్‌తో కూరగాయల విక్రేత మృతి