
వెళ్లిరా ఏకదంతా
యలహంకలో భారీ జన సందోహం మధ్య ఊరేగింపు
బృహత్ గణపతి ముందు ఎమ్మెల్యే విశ్వనాథ్
బనశంకరి: బెంగళూరు యలహంకలో ఆదివారం గణేశ్ నిమజ్జనోత్సవం భారీ జనసందోహం మధ్య వైభవంగా జరిగింది. సంభ్రమ్ కాలేజీ నుంచి నిమజ్జన వేడుక ఆరంభం కాగా యలహంక ఎమ్మెల్యే ఎస్‌ఆర్.విశ్వనాథ్ పాల్గొన్నారు. యలహంక పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ఊరేగింపుగా గణనాథుల విగ్రహాలను తీసుకువచ్చారు. పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జానపద కళాకారుల ప్రదర్శనలు రంజింపజేశాయి. ఊరేగింపుగా తీసుకెళ్లి అల్లాలసంద్ర చెరువులో గణపతులను గంగ ఒడికి సమర్పించారు. యలహంక పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. నగరవ్యాప్తంగా నిమజ్జనం ఆనందోత్సాహాలతో సాగింది.
యలహంక జనసంద్రం

వెళ్లిరా ఏకదంతా